దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ చిత్రాన్ని బాహుబలి కంటే భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రం కోసం దాదాపు 400 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటిష్ కాలం 1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చితం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. రాంచరణ్ కు గాయం కావడంతో తదుపరి షెడ్యూల్ ని కొన్ని రోజులపాటు వాయిదా వేశారు. 

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కు హీరోయిన్ ఎంపిక చేయడం రాజమౌళికి పెద్ద సమస్యగా మారింది. ముందుగా ఎన్టీఆర్ కు జోడిగా బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ ని ఎంపిక చేశారు. కానీ ఆ హీరోయిన్ వ్యక్తిగత కారణాల వలన సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత రాజమౌళి, ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ పరిణీతి చోప్రా , జాక్వెలిన్ ఫెర్నాండేజ్, శ్రద్దా కపూర్ లాంటి స్టార్ హీరోయిన్స్ ని సంప్రదించారు. వారు రెమ్యునరేషన్ విషయంలో చుక్కలు చూపించడంతో రాజమౌళి మనసు  తెలుస్తోంది. 

బాలీవుడ్ హీరోయిన్లు అడిగే రెమ్యునరేషన్ తో ఫారెన్ బ్యూటీలనే దించవచ్చు. వారైతే సినిమాకు బాగా న్యాయం చేస్తారు కూడా. దీనితో రాజమౌళి ఇప్పటికే కొందరు ఫారెన్ నటీమణులతో ఆడిషన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లని కూడా ఫైనల్ చేశారట. వారిద్దరిలో ఎన్టీఆర్ కు సరైన జోడిగా ఒకరిని ఎంపిక చేయాల్సి ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.