మరో రెండు రోజుల్లో రాధే శ్యామ్ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ తరుణంలో రాధే శ్యామ్ చిత్ర రన్ టైంలో 12 నిమిషాలు తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి  

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సినిమాపై ఇప్పటికే ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ఇది. 

ప్రభాస్ లవ్ స్టోరీస్ చేసిన ప్రతి సారి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాధే శ్యామ్ మూవీ థ్రిల్లింగ్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఈ చిత్రంలో ప్రభాస్ పామ్ ఆర్టిస్ట్ ( హస్తసాముద్రిక నిపుణుడు) గా నటిస్తున్నాడు. ఎంతటి వారి జాతకాన్ని, భవిష్యత్తుని అయినా చేతి గీతాల్ని బట్టి చెప్పేయగలడు. అలాంటి విక్రమాదిత్య జీవితంలో ప్రేమ చిగురిస్తే.. ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి.. విధిని ఎదిరించి తన ప్రేమ కోసం ప్రభాస్ ఎలా పోరాడాడు అనే అంశాలు ఈ చిత్రంలో కీలకం కానున్నాయి. 

రాధే శ్యామ్ చిత్రం శుక్రవారం థియేటర్స్ లో సందడి చేయడం మాత్రమే మిగిలి ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల సెన్సార్ కూడా ముగిసింది. ఇలాంటి తరుణంలో ఒక న్యూస్ ఈ చిత్రం గురించి వైరల్ గా మారింది. ఆ న్యూస్ నిజం కూడా. ఇంతకీ అదేంటంటే.. రాధే శ్యామ్ సెన్సార్ పూర్తి చేసుకున్నప్పుడు రన్ టైం 2 గంటల 30 నిమిషాలుగా ఫైనల్ చేసారు. 

కానీ రిలీజ్ కు ఇక రెండురోజులే సమయం ఉండగా ఫైనల్ కాపీలో 12 నిముషాలు కోత పెట్టారు. అంటే రాధే శ్యామ్ చిత్ర రన్ టైం 2 గంటల 18 నిమిషాలు మాత్రమే. 12 నిమిషాలు కొత్త పెట్టారనడానికి ప్రూఫ్ కూడా ఉంది. బుక్ మై షోలో రాధే సహాయం చిత్రం రన్ టైం 2 గంటల 18 నిమిషాలుగా అప్డేట్ చేశారు. 

12 నిమిషాల ఎడిట్ చేయడానికి ఆసక్తికర కారణాలు వినిపిస్తున్నాయి. ఫైనల్ కాపీ రెడీ చేసే ముందు చిత్ర యూనిట్ రాజమౌళికి స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారట. రాజమౌళి సినిమా చూసిన అనంతరం ల్యాగ్ అనిపిస్తున్న కొన్ని సన్నివేసాలని ఎడిట్ చేయాలని సూచించారట. దీనితో 12 మినిషాలు కోత పడ్డట్లు తెలుస్తోంది. దీనితో రాజమౌళి సూచనల మేరకే రాధే శ్యామ్ ఫైనల్ కాపీ రెడీ అయినట్లు తెలుస్తోంది.