ఈ సినిమాను రాజమౌళి తనయుడు ఎస్ఎస్.కార్తికేయ నిర్మిస్తుండడం విశేషం. ఇక కీరవాణి తనయుడు సింగర్ కాల భైరవ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నాడు. పూర్తిగా నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్నాడు. జనవరి మొదట్లో కార్తికేయ వివాహం అనంతరం సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 

పోస్టర్ విషయానికి వస్తే ఆకాశంలో చుక్కలను చూస్తున్న కొందరు వ్యక్తులు..ఆకాశంలో ఒక ఆకారం.. అవి తప్పితే కంటెంట్ పరంగా చిత్ర యూనిట్ ఏమి బయటపెట్టలేదు. జస్ట్ సింపుల్ గా అనిపిస్తున్నా సినిమా టీజర్ బయటకు వచ్చే వరకు ఏమి చెప్పలేము. రాజమౌళి ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ నుంచి సినిమా వస్తుండడంతో తప్పకుండా మ్యాటర్ ఉంటుందని చెప్పవచ్చు.

రాజమౌళి కూడా సినిమా పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ఈ సమయంలో తనకంటే ఎక్కువ ఎవరు సంతోషంగా ఉంటారని ట్వీట్ చేస్తూ తన బాయ్స్ మొదలు పెట్టిన ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని విషెస్ అందిస్తూ ట్వీట్ చేశారు. ఇక సాయి మాధవ్ బుర్ర  మాటలు అందిస్తుండాగా ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో జక్కన్న బాయ్స్ ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.