Asianet News TeluguAsianet News Telugu

సగర్వంగా హైదరాబాద్ తిరిగొచ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. తెల్లవారు జామున ఘనస్వాగతం

ప్రపంచ స్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత గుర్తింపు పొందినప్పటికీ ఆస్కార్ పోటీలో తట్టుకుని నిలబడుతుందా అనే అనుమానాలు ఉండేది. ఎందుకంటే ఇండియన్ చిత్రాలకు ఆస్కార్ అవార్డు ఎప్పుడూ అంత సులభంగా దక్కలేదు. కానీ జక్కన్న అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.

Rajamouli and RRR team return to Hyderabad
Author
First Published Mar 17, 2023, 9:48 AM IST

తెలుగు పాట 'నాటు నాటు' ఆస్కార్ సాధించి భారత దేశానికే గర్వకారణంగా నిలిచింది. అకాడమీ అవార్డ్స్ లో ఈ ఘనత సాధించిన తొలి పాట ఇదే. ఆ మాటకు వస్తే ఆసియాలోనే ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ సాంగ్ నాటు నాటు. ఒక తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా ఈ స్థాయి గుర్తింపు దక్కింది అంటే అది రాజమౌళి విజన్ వల్లే సాధ్యం అయింది. 

ప్రపంచ స్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత గుర్తింపు పొందినప్పటికీ ఆస్కార్ పోటీలో తట్టుకుని నిలబడుతుందా అనే అనుమానాలు ఉండేది. ఎందుకంటే ఇండియన్ చిత్రాలకు ఆస్కార్ అవార్డు ఎప్పుడూ అంత సులభంగా దక్కలేదు. గతంలో ఇండియాకి ఆస్కార్ వచ్చినప్పటికి అది కొన్ని విభాగాల్లో మాత్రమే సాధ్యం అయింది. 

కానీ జక్కన్న అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. నాటు నాటు పాటకి పోటీగా ఆస్కార్ బరిలో హాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్స్ అయిన లేడి గాగా, పాప్ సింగర్ రియానా పాటలు కూడా నిలిచాయి. కానీ వాటిని బీట్ చేస్తూ నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించడం మైండ్ బ్లోయింగ్ ఫీట్ అనే చెప్పాలి. కొన్ని వారాలుగా ఆస్కార్ కోసం యుఎస్ లో గడిపింది ఆర్ఆర్ఆర్ టీం. కాగా నేడు చిత్ర యూనిట్ సగర్వంగా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. 

తెల్లవారుజామున 3 గంటలకు రాజమౌళి, కీరవాణి, రమా రాజమౌళి, కాలభైరవ శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. తెల్లవారు జామున కూడా అభిమానులు జక్కన్న అండ్ టీం కి ఘనస్వాగతం పలకడం విశేషం. ఫ్యాన్స్ కేరింతలు కొడుతుండగా.. రాజమౌళి జై హింద్ అని వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడలేదు. ఎన్టీఆర్ ఇదివరకే హైదరాబాద్ చేరుకోగా.. నేడు రాంచరణ్ ప్రధాని మోడీతో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios