దర్శకధీరుడు రాజమౌళి సాధారణంగా తన సినిమా విషయాలు తప్ప ఇతర విషయాలు అంతగా పట్టించుకోరు. కానీ ఇటీవల జక్కన్న సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి సాధారణంగా తన సినిమా విషయాలు తప్ప ఇతర విషయాలు అంతగా పట్టించుకోరు. కానీ ఇటీవల జక్కన్న సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటున్నారు. రాజమౌళి డ్యాన్స్ వీడియోలు, సోషల్ మీడియాలో కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా రాజమౌళి ఏకంగా ఓ కమర్షియల్ యాడ్ లో నటించారు. ఇది అలాంటి ఇలాంటి యాడ్ కాదు. రాజమౌళి.. స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కలసి నటించిన యాడ్. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది. వార్నర్ మామ చేష్టలు.. రాజమౌళి ఇస్తున్న రియాక్షన్ చాలా ఫన్నీగా ఉంది. 

ఈ యాడ్ క్రేడ్ యాప్ గురించి. రాజమౌళి వార్నర్ కి ఫోన్ చేసి ఐపీఎస్ టికెట్స్ విషయంలో డిస్కౌంట్ కావాలని హెల్ప్ చేయమని అడుగుతాడు. మీకు క్రేడ్ యాప్ ఉంటే క్యాష్ బ్యాక్ లభిస్తుందని చెబుతాడు. ఒకవేళ నార్మల్ యుపిఐ అయితే అని జక్కన్న అడగగా.. అలా అయితే మీరు నాకు ఫేవర్ చేయాలని వార్నర్ అంటాడు. 

Scroll to load tweet…

వార్నర్ అడిగిన ఫేవర్ తనతో సినిమా చేయమని. వార్నర్ చెత్త యాక్టింగ్ ని జక్కన్న భరించలేకపోతాడు. ఆ సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా చేస్తున్నాయి. వార్నర్ తో సినిమా చేసి డిస్కౌంట్ పొందడం కంటే.. క్రేడ్ యాప్ కి అప్ గ్రేడ్ అయి క్యాష్ బ్యాక్ పొందడం మేలని రాజమౌళి చివర్లో రియలైజ్ అవుతాడు. అదన్నమాట ఈ యాడ్.