హాలీవుడ్‌లో బాగా పేరొందిన సిరీస్‌లలో ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ ఒకటి.  ఈ సిరీస్‌కి భారత్‌లోనూ ఎందరో అభిమానులు ఉన్నారు. . ప్రపంచవ్యాప్తంగా హెచ్ బీ ఓ ఛానల్ ద్వారా కోట్లాది అశేష అభిమానులను సంపాదించుకున్న గేమ్ అఫ్ త్రోన్స్ రీసెంట్ గానే ముగిసింది. ఎనిమిది సీజన్ల పాటు సాగిన ఈ టెర్రిఫిక్ సిరీస్ ని ప్రేక్షకులు ఊహించని క్లైమాక్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు. ఇది చాలా మంది ఈ షో అభిమానులకు  తీవ్ర అసంతృప్తిని కలిగించింది. 

మళ్లీ రీ షూట్ చేయమంటూ ఆన్ లైన్ పిటీషన్లు పెట్టేరంటే వాళ్లు ఎంతగా ఈ సీరిస్ ని ఇష్టపడ్డారో ఊహించవచ్చు.  ఈ సీరిస్ కు మన సినిమావాళ్లలోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి సైతం ఈ సీరిస్ కు అభిమాని. ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.

పదేళ్ళపాటు అద్భుతమైన భావోద్వేగాలను రేకేత్తించి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనుభూతి కలిగించారని ఇలాంటి స్టొరీ టెల్లింగ్ ని భవిష్యత్తులో ఎవరు చేయాలనుకున్నా మీరే ఆదర్శంగా నిలుస్తారని మెచ్చుకున్నారు. అయితే సీజన్ 8లోని చివరిదైన 6వ ఎపిసోడ్ తనకూ నచ్చలేదని అన్నారు. అయితే దర్శక నిర్మాతలు ముందు నుంచి దీనికి ప్రిపేర్ చేస్తూ వచ్చారని అది గుర్తించాలని కోరాడు. ప్రతి కథకు మంచి ముగింపు సాధ్య పడదని ఒకవేళ అదే ఆశిస్తే మనం సిరీస్ సరిగా ఫాలో కాలేదని  చెప్పుకొచ్చారు.

ఇక సీజన్‌ 7 వరకు ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్’లో ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి. కానీ ఇటీవల విడుదలైన చివరి సీజన్‌లో కేవలం ఆరు ఎపిసోడ్లనే ప్రదర్శించారు.