Asianet News TeluguAsianet News Telugu

వరసలు తెలుసుకొని న్యూస్ రాయండి..రాజ్ తరుణ్ సీరియస్

సీనియర్ ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ అని రాయడానికి బదులుగా జూనియర్ ఎన్టీఆర్‌ కు భార్యగా అని రాశారు. ఇదే న్యూస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. 

raj tarun angry on english daily

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ వార్త పత్రికపై సీరియస్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్‌' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ నటిస్తోంది.

ఆమె తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ మీడియా వర్గాలు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రకటించాయి. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియా ఎన్టీఆర్‌ బయోపిక్ కు సంబంధించి వార్తను ప్రచురించింది. ఇందులో సీనియర్ ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ అని రాయడానికి బదులుగా జూనియర్ ఎన్టీఆర్‌ కు భార్యగా అని రాశారు. ఇదే న్యూస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

ఈ విషయాన్ని గ్రహించిన రాజ్ తరుణ్ 'బసవతారకం గారు జూనియర్ ఎన్టీఆర్‌ కు నానమ్మ అవుతారు. బయోపిక్ లో విద్యాబాలన్ సీనియర్ ఎన్టీఆర్‌ కు భార్యగా నటిస్తున్నారు. దయచేసి ఇలాంటి వార్తలు పరిశీలించే ముందు జాగ్రత్తగా తెలుసుకొని రాయండి. థాంక్స్' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios