యంగ్ హీరో రాజ్ తరుణ్ పెళ్ళంటా.. అవును ఆహనా పెళ్ళంటా అంటై రాజ్ తరుణ్ స్వయంగా ప్రకటించాడు. అయితే అది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. అది కూడా ఓ వెబ్ మూవీ కోసం. 

యంగ్ హీరో రాజ్ తరుణ్ పెళ్ళంటా.. అవును ఆహనా పెళ్ళంటా అంటై రాజ్ తరుణ్ స్వయంగా ప్రకటించాడు. అయితే అది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. అది కూడా ఓ వెబ్ మూవీ కోసం. 

ఈ మద్య స్టార్స్ అంతా వరుసగా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు యంగ్ హీరోలు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. అందులో రీసెంట్ గా రాజ్ తరుణ్ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. అందులోనూ ఈమధ్య వెబ్‌ సిరీస్‌ల తాకిడి ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా యువత ఇప్పుడు వీటిపై బాగా ఫోకస్‌ పెడుతోంది. దాంతో యంగ్ స్టార్స్ కూడా ఓటీటీల ద్వారా యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 తాజాగా రాజ్‌తరుణ్‌ ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడు. అహనా పెళ్లంట టైటిల్ తో తెరకెక్కుతున్నఈ వెబ్ మూవీలో శివానీ రాజశేఖర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఏబీసీడీ ఫేమ్‌ సంజీవ్‌ రెడ్డి ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను జీ5 సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్ గా రాజమండ్రిలో ఈ వెబ్‌ సిరీస్‌ కు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 

ఎన్నో ఏళ్లుగా పెళ్లి గురించి కలలు కంటున్న ఓ యువకుడికి ఎట్టకేలకు పెళ్లి కుదురుతుంది. కాని సరిగ్గా పెళ్లి జరిగే రోజున పెళ్లి కూతురు, తాను ప్రేమించిన అబ్బాయితో సడెన్ గా వెళ్ళిపోతుంది. షాక్ అయిన పెళ్లి కొడుకు అప్పుడు ఏం చేశాడు. తన రివైంజ్‌ ను ఎలా తీర్చుకున్నాడు అనేదే కథ.

ఈ సందర్భంగా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఇదో సరదా కథ అన్నారు. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రతీ ఎపిసోడ్‌.. కొత్తగా ఉండేలా జాగ్రత్త పడ్డాం అన్నారు. రాజ్‌ తరుణ్‌ ఓ వెబ్‌ సిరీస్‌లో నటించడం ఇదే తొలిసారి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 రోజుల పాటు చిత్రీకరణ జరుపుతాం అని జీ5 ప్రతినిధులు తెలిపారు.