'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. కానీ గత రెండేళ్లుగా ఆయన నటిస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లుగా మిగులుతున్నాయి.

దీంతో సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటివరాక్ తన తదుపరి సినిమాకి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. తాజాగా రాజ్ తరుణ్ ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో ముచ్చటించారు. 

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తీరికగా సమాధానాలు చెప్పాడు. మహేష్ బాబుతో ఫోటో దిగి పోస్ట్ చేయొచ్చు కదా అని ఓ అభిమాని కోరగా.. 'నేను ఆయన్ని కలిశాను.. ఫోటో కూడా దిగాను.

కానీ సోషల్ మీడియాలో షేర్ చేయను. అది నేను చనిపోయేవరకు నాతోనే ఉండిపోతుంది. అది నా వ్యక్తిగత విషయమని' అన్నారు. మరో అభిమాని పెళ్లెప్పుడు అంటూ ఆడగగా.. వచ్చే ఏడాది అని బదులిచ్చాడు. అంటే ఈ కుర్ర హీరో అప్పుడే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడన్నమాట.