Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. పైగా మంచి కుటుంబ కథ కావడంతో ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మార్చి 8 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. 

ఎపిసోడ్ ప్రారంభంలో డాక్టర్ వచ్చి కనకాన్ని టెస్ట్ చేస్తారు. బీపీ ఎక్కువైంది టెన్షన్ తీసుకుంటే చాలా ప్రమాదం. కాస్త రిలాక్స్ అవనివ్వండి కాసేపట్లో మెలుకువ వస్తుంది. ఇంజక్షన్ ఇచ్చాను డోంట్ వర్రీ అంటాడు. అంతలోనే మెలకువ వచ్చి లేవబోతున్న కనకాన్ని మీరు లేవకండి. అంబులెన్స్ వచ్చేవరకు అలాగే పడుకోండి అంటాడు సీతారామయ్య.

నేను హాస్పిటల్ కి వెళ్ళను అంటూ అప్పుని పిలిచి పెద్దదాని బాగు కోరి మీ ఇద్దరిని, మీ నాన్నని ఇబ్బంది పెట్టాను. సత్యహరిశ్చంద్రుడు లాంటి మీ నాన్న నా వల్లే అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఇంత చేసినా ఏమి సాధించలేకపోయాను. కావ్య నన్ను క్షమించు వాళ్ళందరూ నిన్ను నిందిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అంటూ బాధపడుతుంది కనకం.

అదేంటి కనకం నువ్వు వెనక్కి తగ్గుతున్నావా కావ్య ఎలాంటిదో మన వాళ్ళందరికీ తెలుసు అలాంటి అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా అంటుంది ఒక ఆవిడ. ఈ పెళ్లి జరిపించనిదే ఊరుకునేది లేదు అంటూ రెచ్చిపోతుంది మీనాక్షి. అభం, శుభం తెలియని కావ్య కోసం మనం అందరం కలిసి పోరాడుదాం రండి అంటూ ఓవరాక్షన్ చేస్తుంది.

ఒక ఆడపిల్లకి తాళి తప్ప పెళ్లి తంతు అంతా జరిగిపోయాక ఇప్పుడు పెళ్లి వద్దు అంటే దాని జీవితం ఏమైపోవాలో చెప్పండి, దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా అంటూ అందరినీ అడుగుతుంది కామాక్షి. ఈ అమ్మాయి విషయంలో మాకు సానుభూతి ఉంది ఆవేశ పడకండి అంటాడు సీతారామయ్య. ఇంత జరిగిన తర్వాత రాజ్ పెళ్లికి ఒప్పుకుంటాడా అంటుంది చిట్టి.

ఇంత జరిగాక రాజ్ ని ఎవరు ఒప్పిస్తారు అంటుంది రుద్రాణి. మేము ఒప్పిస్తాము, స్త్రీ శక్తి నిరూపిస్తాము అంటూ కావ్య వాళ్ళు ఎంత వారిస్తున్నా వినకుండా ఆడాళ్లందరిని వెనకేసుకుని వెళ్తుంది కామాక్షి. ఇప్పటిదాకా రాజ్ బ్రతికి పోయాడేమో అనుకున్నాను కానీ ఈ ఆడ మేళం అంతా వెళ్లారు రాజ్ ఒక్కడే ఏం చేయగలుగుతాడు.

ఇదే కదా నాకు కావలసింది అనుకుంటుంది రుద్రాణి. ఇంతలోపు ఆడవాళ్ళందరూ రాజ్ చుట్టూ మూగి మీరు అమ్మాయి మెడలో తాళి కట్టాల్సిందే అంటుంది కామాక్షి. మీరే చూశారు కదా ఎలా తాళికట్టమని అడుగుతున్నారు, ఆ స్వప్నే మోసం చేసింది అనుకుంటే ఆమె చెల్లెలు కూడా మోసం చేసింది అంటాడు రాజ్. మోసం లేదు గీసం లేదు ఆమె మెడలో తాళి కట్టాల్సిందే అంటారు ఆ ఆడాళ్ళు.

కట్టకపోతే ఏం చేస్తారు అని రాజ్ అడిగితే ఎత్తుకుపోయి బలవంతంగా తాళి కట్టిస్తాం అంటారు వాళ్లు.తాళి కట్టాల్సింది నేను. బలవంతంగా తాళి కట్టించగలరేమోగానీ మమ్మల్ని కలిపి ఉంచలేరు అంటాడు రాజ్. అప్పుడు నాకు కోపం వస్తుంది అప్పుడు అల్లుడు అని కూడా చూడను అంటూ రెచ్చిపోతుంది కామాక్షి. అప్పుడే అక్కడికి వచ్చిన మీడియా ఐశ్వర్యానికి, పేదరికం కి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది.

వెళ్ళిపోతున్న రాజ్ ని అంతా కలిపి ముట్టడి చేసి, కదలకుండా కట్టడి చేశారు. దుగ్గిరాల వంశానికి వారసుడై ఉండి ఇలాగా చేయటం సభ్య సమాజం హర్షిస్తుందా, అసలు ఇతనికి నైతిక విలువలు ఉన్నాయా అంటూ లేనిపోని హైప్ సృష్టిస్తారు. ఇదంతా చూస్తున్న రుద్రాణి కుటుంబం పరువు పోయేలాగా ఉంది ఆ ఆడవాళ్ళందరూ చేరి తప్పు మనదే అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు అని తండ్రికి చెప్తుంది.

రాజ్ ని చులకన చేసి మాట్లాడుతున్నారు అందరూ ఆడపిల్ల తరుపున చేరిపోయారు అంటుంది చిట్టి. మీరే నిర్ణయం తీసుకోండి రాజ్ ని మీరే ఒప్పించండి అంటూ సీతారామయ్యకి చెప్తుంది ధనలక్ష్మి. సుభాష్ ని పిలిచి రాజ్ ని తీసుకు రమ్మంటాడు సీతారామయ్య. కానీ వాడికి ఈ పెళ్లి ఇష్టం లేదు అంటాడు సుభాష్. మన పరువు పోతుంది పరవాలేదా అంటాడు సీతారామయ్య.

నేను అలాగనట్లేదు వాడికి బలవంతం చేయొద్దు అంటున్నాను అంటాడు సుభాష్. నేను మాత్రం అలా ఎందుకు చేస్తాను వాడి అభిప్రాయాన్ని కనుక్కుంటాను తీసుకు రమ్మంటాడు సీతారామయ్య. మరోవైపు ఈ తతంగానంతా కవర్ చేస్తున్న రిపోర్టర్ ఈ దెబ్బతో చీఫ్ రిపోర్టర్ నుండి చీఫ్ ఎడిటర్ గా ప్రమోట్ అయిపోతాను ఈ అవకాశం ఇచ్చిన రాహుల్ కి థాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటుంది.

కళ్యాణ మండపం అంతా యుద్ధ వాతావరణం నెలకొంది, దుగ్గిరాల వాళ్ళు ఇంట్లో ఇంత గందరగోళం జరగడం ఇదే మొదటిసారి. ఇప్పుడు రాజ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు వేచి చూడాలి అంటుంది రిపోర్టర్. మరోవైపు కృష్ణమూర్తి సీతారామయ్యతో మాట్లాడుతూ మీకు పేద గొప్ప తేడా లేదని తెలుసు అలాగే కళాకారుల కుటుంబం అంటే గౌరవం అని కూడా మా అమ్మాయి చెప్పింది.

 మా ఆవిడ చేసిన తప్పుకి మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాను కానీ ఇప్పుడు నా కూతురు గురించి, మీ మనవడి గురించి వార్తలు దేశమంతా తెలిసిపోయేలాగా వెళ్ళిపోతున్నాయి. ఈ గొడవ ఈ పెళ్లి మండపం వరకే అయితే సర్దుకుపోయేవాడిని కానీ మీ లాంటి పెద్ద వాళ్లతో కుదుర్చుకున్న సంబంధం కావడం వలన ఈ గొడవ పెద్దదయింది.

ఇంత జరిగాక నా కూతుర్ని ఏ మూలకి తీసుకెళ్లినా కూడా ఎవరు పెళ్లి చేసుకోరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఉన్నది ఒకటే దారి అందుకే మిమ్మల్ని ప్రాధేయ పడుతున్నాను నా కూతుర్ని మీ మనవడికి ఇచ్చి పెళ్లి చేయండి అంటూ చేతులు జోడిస్తాడు సీతారామయ్య. నేను కూడా బిడ్డల్ని కన్న తండ్రినే,ఆడపిల్లల తండ్రి బాధని అర్థం చేసుకోగలను అంటాడు సీతారామయ్య.


 ఇంతలో సుభాష్ వచ్చి తాతయ్య రమ్మంటున్నారు అని రాజ్ కి చెప్తాడు. నేను రాను అని రాజ్ అంటే చుట్టూ మీడియా ఉంది లోపల మాట్లాడుకుందాం రా అని రాజ్ ని లోపలికి తీసుకెళ్తాడు సుభాష్. రాజ్ కుటుంబ సభ్యులందరూ రాజ్ ని,కావ్య కుటుంబ సభ్యులందరూ కావ్య ని పెళ్లి చేసుకోమని బలవంత పెడుతుంటారు. ఈ పెళ్లి చేసుకోవడం వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు.

 వందేళ్ళ నుంచి ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల మన కుటుంబానికి ఎలాంటి అప్రతిష్ట రాకూడదని నిర్ణయం నీకే వదిలేస్తున్నాను అంటాడు సీతారామయ్య. మీరు శాసిస్తున్నారా, సలహా ఇస్తున్నారా అంటాడు రాజ్. ఆజ్ఞాపించాలో అభ్యర్థించాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను నిర్ణయం నువ్వే తీసుకో అంటాడు సీతారామయ్య.

నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ వెళ్ళిపోతుంటుంది కావ్య. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అంటూ అక్కడికి వస్తాడు రాజ్. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇద్దరూ పెళ్లి పీటల మీద కూర్చుంటారు కానీ ముభావంగా ఉంటారు. రాజ్, కావ్యకి తాళి కట్టబోతుంటే కృష్ణమూర్తికి కూతురుతో అన్న మాటలు గుర్తుకు వస్తాయి.

రాజ్ చెడ్డవాడని అన్నావు అలాంటి వాడికి స్వప్న నిచ్చి పెళ్లి చేయటానికి భయంగా ఉంది అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడతాడు కృష్ణమూర్తి. మొత్తానికి కావ్య మెడలో తాళికట్టేస్తాడు రాజ్. కావ్య కన్నీరు పెట్టుకుంటుంది. నీలాంటి మంచి అమ్మాయికి మంచి మనసున్న మహారాజే భర్తగా వస్తాడు అన్న తండ్రి మాటలు తలుచుకొని బాధపడుతుంది.

తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన రాజ్ ని చూసి ఆనందంతో నా కొడుకు వచ్చేసాడు అంటూ హారతి పళ్ళెంతో గుమ్మం దగ్గరకు వెళ్లి హారతి ఇవ్వకుండా లోపలికి రాకు, మీ జంట మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమో అంటూ స్వప్న ఏది అని అడుగుతుంది అపర్ణ. రాజ్ ఏమి మాట్లాడకపోవటంతో మీ వదిన ఏది అంటూ కళ్యాణ్ ని అడుగుతుంది. కళ్యాణ్ పక్కకు తప్పుకోవటంతో అక్కడ పెళ్ళికూతురి గెటప్ లో ఉన్న కావ్య ని చూసి షాక్ అవుతుంది.