Asianet News TeluguAsianet News Telugu

నా చెల్లి భర్తతో నా మొదటి భార్య ఎపైర్

 భార్య కవిత నా సోదరి భర్తతో ఎఫైర్ పెట్టుకుందని అన్నారు. తాము లండన్ లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందని అన్నారు.

Raj Kundra slams ex-wife, says she had affair with his sisters husband  jsp
Author
Hyderabad, First Published Jun 12, 2021, 12:35 PM IST

2009 నవంబర్‌లో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా వివాహం చేసుకున్నారు. అయితే రాజ్ కుంద్రాకు మొదట ఓ వివాహం జరిగి,విడాకులు అయ్యాయి. ఆమె పేరు కవిత. రీసెంట్ గా  ఆమె ఓ ఇంటర్వూలో శిల్పాశెట్టి తన విడాకులకు కారణం అని బ్లేమ్ చేసింది. ఆ ఆరోపణలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన కాపురం విచ్చిన్నం కావడానికి కారణం శిల్పాశెట్టి అంటూ కవిత ఆ ఇంటర్వూలో విరుచుకుపడ్డారు. పలు పత్రికల్లో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి అతిసన్నిహితంగా ఉన్న ఫోటోలు చూశాను. నా స్థానంలో నాభర్తతో ఆమె లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారనే బాధతో కుమిలిపోయాను అని కవితా కుంద్రా చెప్పుకొచ్చింది. ఈ విషయమై రాజ్ కుంద్రా మాట్లాడారు. అవన్ని అర్దం పర్దం  లేని ఆరోపణలు అన్నారు. అంతేకాకుండా మరో అంతర్గత విషయం చెప్పుకొచ్చారు.

రాజ్ కుంద్రా మాట్లాడుతూ తన  మాజీ భార్య కవిత నా సోదరి భర్తతో ఎఫైర్ పెట్టుకుందని అన్నారు. తాము లండన్ లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందని అన్నారు. అలాగే శిల్పాశెట్టికు వ్యతిరేకంగా మీడియాలో రాయించటానికి ఆమె వేల పౌండ్స్ ఖర్చు పెట్టిందని  అన్నారు. తాము  విడిపోయేనాటికి తమకు నలభై రోజుల బిడ్డ ఉందని, ఆమెను ఇప్పటిదాకా కలవనివ్వలేదని వాపోయారు.
 
బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ... "మేము మా అమ్మ,నాన్న,చెల్లి,ఆమె భర్త  కలిసి ఓ ఇంట్లో ఉండేవాళ్లం. నా సోదరి భర్తతో మా ఆవిడ ఎక్కువ సేపు గడిపేది. ముఖ్యంగా నేను బిజినెస్ ట్రిప్పులకు వెళ్లినప్పుడు ఇద్దరు బాగా స్పెండ్ చేసేవారు. మా కుటుంబ సభ్యులు, చివరకు  మా డ్రైవర్ కు కూడా అనుమానం  వచ్చింది.  "

ఆ తర్వాత మా సోదరి,ఆమె భర్త ఇండియా వచ్చేసారు. అయినా సరే రిలేషన్ కంటిన్యూ చేసింది నా మాజీ భార్య. ఓ సీక్రెట్ సెల్ ఫోన్ ని బాత్రూమ్ లో పెట్టుకుని మాట్లాడేది. ఆ సెల్ ఫోన్ నా కంటబడింది. అందులో  మెసేజ్ లు చూసాక నా గుండె బ్రద్దలైంది. నేను ఏడ్చాను. అప్పటికే నా సోదరి ప్రెగ్నెంట్. ఆమెను కలిసి విషయం మొత్తం చెప్పాను. ఆ తర్వాత నా మాజీ భార్యను వాళ్ల పుట్టింట్లో దింపేసాను.  విషయం తెలిసాక నా సోదరి తన భర్తకు మరో ఛాన్స్ ఇవ్వాలని నిశ్చయించుకుంది. నేను మాత్రం నా భార్య నుంచి విడిపోయాను అని చెప్పుకొచ్చారు.
 
ఇక రాజ్ కుంద్రా,శిల్పాశెట్టిలకు  2012 మేలో కుమారుడు(వియాన్‌) జన్మించాడు. ఎన్నో టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన శిల్పా 13 సంవత్సరాలపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె షబ్బీర్‌ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘నికమ్మ’ అనే సినిమాతో వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నహాలు చేస్తున్నారు. దీనితోపాటు ఆమె ‘హంగామ2’ చిత్రంలో కూడా సందడి చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios