Asianet News TeluguAsianet News Telugu

కోట్లల్లో మనీ లావాదేవీలు.. రాజ్‌కుంద్రా బ్యాంక్‌ ఖాతాలు సీజ్‌..

 ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ఆదేశాల మేరకు రాజ్‌కుంద్రా బ్యాంక్‌ అకౌంట్లని సీజ్‌ చేసినట్టు బ్యాంక్‌ అధికారులు వెల్లడించారు. సీజ్‌ చేసిన రెండు బ్యాంక్‌ ఖాతాల్లో ఇటీవల కాలంలో కోట్ల రూపాయలు జమ అయినట్టు అధికారులు తెలిపారు. 

raj kundra bank accounts seizes by mumbai crime brach police  arj
Author
Hyderabad, First Published Jul 26, 2021, 2:49 PM IST

కోట్లలో లావాదేవీలు జరిగిన రాజ్‌కుంద్రా బ్యాంక్‌ అకౌంట్లని ముంబయి పోలీసులు సీజ్‌ చేశారు. ఆదివారం రాజ్‌కుంద్రాకి చెందిన రెండు ఎస్‌బీఐ బ్యాంక్‌ అకౌంట్లని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సీజ్‌ చేసినట్టు ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ఆదేశాల మేరకు వాటిని సీజ్‌ చేసినట్టు బ్యాంక్‌ అధికారులు వెల్లడించారు. సీజ్‌ చేసిన రెండు బ్యాంక్‌ ఖాతాల్లో ఇటీవల కాలంలో కోట్ల రూపాయలు జమ అయినట్టు అధికారులు తెలిపారు. 

అయితే ఆదివారం ఈ బ్యాంక్‌లను సీజ్‌ చేసిన తర్వాత రాజ్‌కుంద్రాకి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. అరవింద్‌ శ్రీవాస్తవ.. రాజ్‌కుంద్రా నిర్మాణ సంస్థని నడిపిస్తున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించి మనీ శ్రీవాస్తవ భార్య హర్షితకి బదిలీ చేస్తున్నట్టు  అధికారులు గుర్తించారట. 

మరోవైపు దీనిపై అరవింద్‌ శ్రీవాస్తవ తండ్రి ఎన్పీ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత రెండేళ్లుగా అరవింద్‌ ఇంటికి రాలేదని తెలిపారు. గృహ ఖర్చులకు మాత్రం టైమ్‌ టూ టైమ్‌ డబ్బులను పంపించేవారని తెలిపారు. అయితే హర్షిత బ్యాంక్‌ అకౌంట్‌కి డబ్బు బదిలీ అవుతున్న విషయాలకు సంబంధించి తనకేం తెలియదని ఎన్సీ శ్రీవాస్తవ వెల్లడించారు.

ఇదిలా ఉంటే రాజ్‌కుంద్రాకి వ్యతిరేకంగా ఆయన సంస్థలో పనిచేసే ఉద్యోగులే సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావడం రాజ్‌కుంద్రాకి పెద్ద షాక్‌ అని చెప్పొచ్చు. పోర్న్ చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాని ఈ నెల 19న పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ కేసులో 11 మంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల 27 వరకు రాజ్‌కుంద్రా పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. 

ఇదిలా ఉంటే ఈ కేసులో మరికొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మనీ లాండరింగ్‌ విషయం, ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ మెనేజ్‌మెంట్‌  కేసులు కూడా రాజ్‌కుంద్రాపై పెట్టబోతున్నారు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు. 

Follow Us:
Download App:
  • android
  • ios