`బిగ్‌బాస్‌3` ఫేమ్‌, నటి పునర్నవి భూపాలం ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. యూట్యూబ్‌ పాపులర్‌ ఉద్భవ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్‌ అయినట్టు తెలిసింది. రేపు(శుక్రవారం) అన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. దీంతో ఆమె అభిమానులు మొత్తం షాక్‌ అయ్యారు. అయితే పునర్నవి, `బిగ్‌బాస్‌3` విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య లవ్‌ ఎఫైర్‌ ఉందని, వీరి త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. 

కానీ ఇప్పుడు పునర్నవి మరో వ్యక్తిని పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దీనిపై పునర్నవి ప్రియుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. `నేను నా భయాలను మోసం చేశాను, నా సందేహాలు బ్రోక్‌ అయ్యాయి. నా విశ్వాసానికి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు నేను నా కలలను మ్యారేజ్‌ చేసుకున్నా` అని ఎమోషనల్‌గా పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో పెట్టుకున్నారు. 

దీంతో ఇప్పుడి సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతుంది. దీన్ని బట్టి రాహుల్‌ సిప్లిగంజ్‌ని పునర్నవి మోసం చేసిందనే విషయం చెప్పకనే చెప్పేశారు.