Asianet News TeluguAsianet News Telugu

రవితేజ వయస్సుపై రాఘవేంద్రరావు ఫన్నీ సెటైర్

సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో, 'మాస్ మీట్' పేరుతో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు .. హరీశ్ శంకర్ .. బండ్ల గణేశ్ హాజరయ్యారు.

Raghavendra Rao at Ravi Teja Dhamaka Mass Meet
Author
First Published Dec 30, 2022, 10:35 AM IST


రవితేజ – నక్కిన త్రినాథరావు కాంబినేషన్లో ‘ధమాకా’ సినిమా తెరకెక్కింది. ఈ నెల 23వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలిరోజునే పాజిటివ్‌ టాక్ ను సొంతం చేసుకుంది. తొలి రోజునే 10 కోట్లకి పైగా గ్రాస్ ను చూసిన ఈ సినిమా, రెండో రోజున 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇలా రోజుకి 10 కోట్ల చొప్పున వసూళ్లను రాబడుతూ 5 వ రోజుకి 49 కోట్లను రాబట్టి, 50 కోట్ల మార్కును టచ్ చేయడానికి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను 'మాస్ మీట్' పేరుతో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈవెంటును నిర్వహించారు. 

ఈ వేదికపై రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. "సాధారణంగా గెస్టుగా ఎవరినైనా పిలిస్తే, చాలా బిజీగా ఉన్నప్పటికీ రాక తప్పలేదని చెబుతుంటారు. కానీ నిజానికి నేను అంత బిజీగా ఏమీ లేను. పైగా పిలవకపోయినా వచ్చాను. 5 వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు ఫ్లూట్ ఊదితే 16 వేల మంది గోపికలు వచ్చారు. పీపుల్ మీడియా వారు కూడా అలాంటి ఫ్లూట్ ఏదో ఊదే ఉంటారు .. అందుకే డబ్బులే డబ్బులు. 

నాకు తెలిసి ఆ ఫ్లూట్ వాళ్ల ఆఫీసులో ఉందని అనుకుంటున్నాను. ఆ ఫ్లూట్ ను నిర్మాతల ఆఫీసు నుంచి దొంగతనంగా తీసుకురావలసిన బాధ్యత శ్రీలీలదే. ఆ ఫ్లూట్ ను ఒకసారి మా ఆర్కే ఆఫీసులో కూడా ఊది చూడాలి. ఇక రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. నా చిన్నప్పటి నుంచి ఆయన అలాగే ఉన్నాడు" అంటూ నవ్వులు పూయించారు. రవితేజ వయస్సు మీద సెటైర్ లా అనిపించి అందరూ నవ్వుకున్నారు. 

 రవితేజ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి సంబంధించి ముందుగా నా టెక్నీషియన్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కార్తీక్ ఘట్టమనేని ఫొటోగ్రఫీ వలన ఈ సినిమా తెరపై ఇంత కలర్ఫుల్ గా కనిపించింది. మేము కూడా చాలా అందంగా కనిపించాము. ఈ సినిమా సక్సెస్ కి మొదటి కారణం భీమ్స్ అందించిన సాంగ్స్. తను ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాడు. 

ఇక రెండో కారణంగా నిర్మాతలు .. వాళ్ల అంకితభావాన్ని గురించి చెప్పుకోవాలి. ఈ బ్యానర్లో మళ్లీ మళ్లీ పనిచేయాలనిపిస్తోంది. మరో కారణంగా బెజవాడ ప్రసన్న కుమార్ పేరు చెప్పాలి. ఈ సినిమాలో మీరంతా ఎంజాయ్ చేస్తున్న డైలాగ్స్ ఆయన రాసినవే. ఇక శ్రీలీల టాలెంట్ .. గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. తను డాన్స్ కూడా చాలా బాగా చేసింది. ఇక ఈ బస్ కి డ్రైవర్ త్రినాథరావు అయితే నేను కండక్టర్. మీ అందరి సపోర్టు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ముగించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios