Asianet News TeluguAsianet News Telugu

రెండ్రోజుల్లో చంద్రముఖి2 రిలీజ్.. మరోసారి రజినీ వద్దకు రాఘవా లారెన్స్

రాఘవా లారెన్స్ - కంగనా రనౌత్ కలిసి నటించిన ‘చంద్రముఖి2’ రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ను రాఘవా మరోసారి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. 
 

Raghava Lawrence sought the blessings of rajinikanth ahead of the Chandramukhi2 release NSK
Author
First Published Sep 26, 2023, 12:54 PM IST

17 ఏళ్ల తర్వాత ‘చంద్రముఖి’కి సీక్వెల్ రాబోతోంది. మరోరెండ్రోజుల్లో Chandramukhi 2 థియేటర్లలో గ్రాండగా విడుదల కానుంది. రాఘవా లారెన్స్ (Raghava Lawrence) - కంగనా రనౌత్ (Kangana Ranaut) కలిసి నటించిన ఈ కామెడీ హారర్ర్ ఫిల్మ్  కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 2005లో రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రలో మెప్పించారు. అప్పట్లో ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషన్ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడు రాఘవా లారెన్స్, బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించడం విశేషం. 

సెప్టెంబర్ 28న చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రధాన ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతోంది. రిలీజ్ సందర్భంగా రాఘవా లారెన్స్  తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)ను కలిశారు. తలైవాను మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే ‘జైలర్’ బ్లాక్ బాస్టర్ కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. ఇక రజనీ ‘చంద్రముఖి2’ చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభంలోనే రాఘవా లారెన్స్ రజనీకాంత్ ను కలిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు. ఇప్పుడు రిలీజ్ సమయంలోనూ మళ్లీ కలవడం విశేషం. 

కామెడీ, హారర్ చిత్రాల్లో నటించి ఇదివరకే రాఘవా లారెన్స్  మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ‘ముణి’, ‘కాంచనా’ వంటి చిత్రాలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. అయినా, ‘చంద్రముఖి’ సీక్వెల్ లో రాఘవా ఎలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చారనేది ఆడియెన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. మారుతున్న ఆడియెన్స్ వ్యూకు అనుగుణంగా చిత్రాన్ని తెరకెక్కించారని అర్థం అవుతోంది. కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో పాటు యాక్షన్ నూ గ్రాండ్ గా చూపించబోతున్నారని ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే అర్థం అవుతోంది. 

సీక్వెల్ ను కూడా ప్రముఖ దర్శకుడు పీ వాసునే డైరెక్ట్ చేశారు. దిగ్గజ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌజ్ లో రూపుదిద్దుకుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక రాఘవా లారెన్స్ తో లైనప్ లో ‘జిర్తాండా డబుల్’, ‘అధిగారమ్’, ‘దుర్గ’ వంటి చిత్రాలున్నాయి. త్వరలోనే అవీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios