చంద్రముఖి 2 ఆడియో రిలీజ్ జరుగుతున్న ఆడిటోరియం బయట ఓ బౌన్సర్ కి, స్టూడెంట్ కి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో బౌన్సర్ స్టూడెంట్ పై దాడి చేశారు. 

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. జ్యోతిక టైటిల్ రోల్ పోషించిన చిత్రం చంద్రముఖి అప్పట్లో ఒక సంచలనం. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా చంద్రముఖి 2 వస్తోంది. అయితే సీక్వెల్ లో రజనీ నటించడం లేదు. రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. 

ఇక చంద్రముఖి పాత్రలో లేడీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తోంది. అప్పుడే కంగనా జ్యోతిక స్థాయిలో మెప్పిస్తుందనే పోలికలు కూడా మొదలైపోయాయి. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. రీసెంట్ గా చెన్నైలో ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక జరిగింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రీ రిలీజ్ వేడుకలు, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్, సినిమా ఈవెంట్స్ జరిగినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు. ఈ క్రమంలో స్టార్స్ కి రక్షణ వలయంలా బౌన్సర్లు ఉంటారు. అభిమానుల వల్ల హీరోయిన్లు, హీరోలు తరచుగా ఇబ్బంది పడడం చూస్తూనే ఉన్నాం. 

కొందరు ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కోసం బౌన్సర్లని కూడా దాటుకుని స్టేజిపైకి వెళ్లి హీరోల కాళ్లపై పడుతుంటారు. అయితే చంద్రముఖి ఆడియో రిలీజ్ లో జరిగిన సంఘటన వేరు. ఆడియో రిలీజ్ జరుగుతున్న ఆడిటోరియం బయట ఓ బౌన్సర్ కి, స్టూడెంట్ కి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో బౌన్సర్ స్టూడెంట్ పై దాడి చేశారు. 

Scroll to load tweet…

ఈ సంఘటన లారెన్స్ దృష్టికి ఆలస్యంగా వెళ్ళింది. తాజాగా ఈ వివాదంపై లారెన్స్ స్పందిస్తూ స్వయంగా క్షమాపణ కోరాడు. చంద్రముఖి2 ఆడియో లాంచ్ జరుగుతున్నప్పుడు బౌన్సర్ కి, స్టూడెంట్ కి మధ్య జరిగిన సంఘటన నా దృష్టికి ఇప్పుడే వచ్చింది. ఆడియో లాంచ్ లో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతోందో నాకు తెలియలేదు. మీకు తెలుసు.. స్టూడెంట్స్ అంటే నాకు ఎంత ఇష్టమో అని. నేనెప్పుడూ వారి అభివృద్ధిని కోరుకుంటాను. కారణం ఏదైనా సరే స్టూడెంట్ పై దాడి చేయడం తప్పు. ఏ ఘటన జరిగినందుకు నేను క్షమాపణ చెబుతున్నా. బౌన్సర్లు ఇకపై ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దు అని కోరుతున్నా అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు.