రాఘ‌వా లారెన్స్ (Raghava Lawrence) నటిస్తున్న తాజా చిత్రం రుధ్రన్‌. తెలుగులో రుద్రుడు (Rudhrudu) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా డైరెక్టర్ కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘రుద్రుడు’. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. రుద్రుడు 2023లో ఏప్రిల్ 14న వేసవిలో థియేటర్స్ లో అలరించనుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్ కంటెంట్ లో లారెన్స్ కంప్లీట్ ట్రాన్స్ ఫార్మ్మేషన్ లో రగ్గడ్ లుక్ లో కనిపించారు. ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్స్ క్రియేటడ్ అనే ట్యాగ్ లైన్ సినిమాలో లారెన్స్ పాత్రని తెలియజేస్తోంది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కు వస్తే...మామూలుగా లేదని తెలుస్తోంది.

ఈ చిత్రం తెలుగు రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి పూర్వి పిక్చర్స్ వారు, టాగూర్ మధు కలిసి 6.5 కోట్లకు తీసుకున్నట్లు సమాచారం. లారెన్స్ ఇక్కడ చెక్కు చెదరని మార్కెట్ ఉండటమే అందుకు కారణం. మాస్ సెంటర్లలో ఇప్పటికీ లారెన్స్ కు ఆదరణ ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు.

 వ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.

కతిరేశన్ మాట్లాడుతూ...“ప్రతిష్టాత్మక ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ నుండి పొల్లాధవన్, ఆడుకాలం, జిగర్తాండ, డైరీ విజయవంతమైన బ్లాక్‌బస్టర్స్ వరుసలో మా తదుపరి ప్రాజెక్ట్ రాఘవ లారెన్స్ మాస్టర్‌ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ 'రుద్రుడు'. రాఘవ లారెన్స్ మాస్టర్ కాంచన-3 విడుదలై దాదాపు మూడు సంవత్సరాల తర్వాత థియేట్రికల్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రంతో అభిమానులను, ప్రేక్షకులను అలరించదానికి మా వంతు గొప్ప కృషి చేస్తున్నాం. రుద్రుడు మిమ్మల్ని ఏప్రిల్ 2023లో థియేటర్లలో కలుస్తాడు'' అని కతిరేసన్ పేర్కొన్నారు.

రాఘవా లారెన్స్ ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న జిగర్తాండ 2లో నటిస్తున్నాడు. పి వాసు డైరెక్షన్‌లో చంద్రముఖి 2 కూడా చేస్తున్నాడు.