Asianet News TeluguAsianet News Telugu

రజనీ ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు

తన అనారోగ్య పరిస్థితుల కారణంగా తాను ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రకటించడం లేదని ఇటీవల రజనీకాంత్‌ అఫీషియల్ గా ప్రకటన చేసిన సంగతి విషయం తెలిసిందే. దీంతో రజనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పలువురు ఫ్యాన్స్ గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా రజనీకి నచ్చజెప్పాలని కోరుతూ.. పలువురు నెటిజన్లు లారెన్స్‌కు సైతం మెస్సేజ్‌లు పెట్టారు. దాంతో  సదరు నెటిజన్ల ట్వీట్లపై లారెన్స్‌ స్పందించారు. 

Raghava Lawrence Apologizes To Rajini Fans jsp
Author
Hyderabad, First Published Jan 14, 2021, 8:19 AM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు క్షమాపణలు  ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసారు. రజనీ ఫ్యాన్స్ ఇప్పుడీ ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తమిళ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. లారెన్స్ స్పందించటానికి గల కారణం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం

తన అనారోగ్య పరిస్థితుల కారణంగా తాను ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రకటించడం లేదని ఇటీవల రజనీకాంత్‌ అఫీషియల్ గా ప్రకటన చేసిన సంగతి విషయం తెలిసిందే. దీంతో రజనీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పలువురు ఫ్యాన్స్ గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా రజనీకి నచ్చజెప్పాలని కోరుతూ.. పలువురు నెటిజన్లు లారెన్స్‌కు సైతం మెస్సేజ్‌లు పెట్టారు. దాంతో  సదరు నెటిజన్ల ట్వీట్లపై లారెన్స్‌ స్పందించారు. 

‘తలైవా నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూడాలని చాలామంది సోషల్‌మీడియా వేదికగా నాకు మెస్సేజ్‌లు, ట్వీట్లు చేస్తున్నారు. వారందరికీ సమాధానం చెప్పడం కోసమే ఈ ప్రకటన విడుదల చేస్తున్నాను. రజనీ నిర్ణయంతో  మీరు ఎలాంటి బాధను అనుభవిస్తున్నారో అదేవిధమైన నిరాశను నేనూ చవిచూస్తున్నాను. తలైవా రాజకీయాల్లోకి రాకపోవడానికి వేరే ఏదైనా కారణం చెప్పి ఉంటే ఆయన రావాలని మనం వేడుకోవచ్చు. కానీ ఆయన ప్రధాన కారణం అనారోగ్యం. ఒకవేళ మనవల్ల ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని.. మళ్లీ అనారోగ్యానికి గురైతే జీవితాంతం మనం సిగ్గుతో బాధపడాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టనప్పటికీ ఆయన ఎప్పటికీ నా గురువే. ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనందరం దేవుడిని ప్రార్థిద్దాం’ అని లారెన్స్‌ వివరించారు.

ఇదిలా ఉంటే ఆయన అలానే పోస్ట్ లు వస్తున్న నేపథ్యంలో మరోసారి లారెన్స్ స్పందించారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. ఇందులో రజనీకాంత్‌కి ఎలాంటి సంబంధం లేదన్నారు. నా అభిప్రాయాలు ఆయనపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోవన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios