డ్యాన్స్ మాస్టర్ గా  నటుడిగా డైరెక్టర్ మ్యూజిక్ డైరక్టర్ గా ఇలా ఎన్నో కోణాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే అన్నిటికంటే ఎక్కువగా సాయం చేసే మనిషిగా ఎంతో ఎదిగిన రాఘవ లారెన్స్ రీసెంట్ గా కాంచన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ గా మాట్లాడాడు. 

హైదరాబాద్ లో కూడా లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించనున్నట్లు తెలియయజేస్తూ మెగాస్టార్ చేసిన సాయం గురించి చెప్పారు. ఇండస్ట్రీలో మొదటి అవకాశం ఇచ్చిన వ్యక్తి మెగాస్టార్ అంటూ.. ఆయన రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ కోసం 10 లక్షలు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే కొంత మంది సాయం కోసం వచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని లారెన్స్ వివరణ ఇచ్చాడు. 

తన దగ్గర సాయం కోసం వచ్చే ముందు గేటు దగ్గరికి రాగానే వారి వంటిపై ఉన్న నగలను తీసేసి కష్టాల్లో ఉన్నట్లు చాలా మంది యాక్టింగ్ చేస్తున్నారని అయితే విరాళం వచ్చే ప్రతి రూపాయి కష్టాల్లో ఉన్నవారికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మెగాస్టార్ ఇచ్చిన డబ్బుని కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం చేసి ఆ డబ్బును ఉపయోగించిన విధానం గురించి తప్పకుండా మెగాస్టార్ కి చూపిస్తానని లారెన్స్ తెలియజేశారు.