Radhe shyam : ఓటీటీలో రాధేశ్యామ్ మూవీ.. పోటీ పడుతున్నరెండు భారీ సంస్థలు..?
ప్రభాస్(Prabhas)- పూజా హెగ్గే(Pooja Hegde) జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్(Radhe Shyam). యూవీ క్రియేషన్స్, టి సిరీస్ తో కలిసి గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా కు దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు.
ప్రభాస్(Prabhas)- పూజా హెగ్గే(Pooja Hegde) జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్(Radhe Shyam). యూవీ క్రియేషన్స్, టి సిరీస్ తో కలిసి గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా కు దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. రోమన్ కాలం నాటి రొమాంటిక్ లవ్ స్టోరీతో తెరకెక్కిన రాధేశ్యామ్ లో తాను మనసిచ్చి.. ప్రేమించిన అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో.. ఈమెను దక్కించుకోవడం కోసం చేసే సాహసమే రాధేశ్యామ్ కథ. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళకు పైగా కష్టపడ్డారు.
రాధేశ్యామ్(Radhe Shyam) మూవీ ఇటలీలో చాలా భాగం షూటింగ్ చేశారు. కరోనా అడ్డు తగులుతూ ఉండటంతో.. ఏకండా రోమన్ కాలం నాటి ఇటాలీయన్ వాతావరణాలన్ని ఇక్కడే రామోజీ ఫీల్మ్ సిటీలో... భారీ సెట్ రూపంలో వేసి మరీ షూటింగ్ చేశారు. ఎన్ని విమర్షలు ఎదురైనా కామ్ గా అన్నీ భరిస్తూ.. సనిమాను కంప్లీట్ చేశారు టీమ్. ఈ సినిమాను ఎప్పుడో లాస్ట్ ఇయర్ దసరాకే రిలీజ్ చేయాలి అనుకున్నారు.
కాని కరోనా ఈ సినిమా వల్ల షూటింగ్ డిలే అవుతూ వచ్చింది.. ఈ ఏడాది సంక్రాంతికి చేరింది సినిమా. సంక్రాంతి కానుకుగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ (RRR) లాంటి పెద్ద సినిమా పోటీకీ ఉన్నా.. తగ్గేదేలే అన్నట్టు సిద్థమయ్యారు. కాని ఇంతలో కరోనా థార్డ్ వేవ్ రూపంలో మరోసారి ఈమూవీ రిలీజ్ కు బ్రేక్ పడింది. దాంతో సినిమాను మళ్లీ రిలీజ్ వాయిదా వేసుకోక తప్పలేదు. దాంతో ఈమూవీ సమ్మర్ రిలీజ్ అవుతంది అని అందరూ భావిస్తున్నారు.
అయితే అది కూడా మార్చ్ 18ని లాక్ చేసుకన్నారంటూ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమన్నాయి. కాని ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది. రాధేశ్యామ్ (Radhe Shyam) ను ఓటీటీ కి ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కరోనాకారణంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితుల మారిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. దాంతో భారీ బడ్జెట్ సినిమాకు రిలీజ్ కష్టాలు.. కలెక్షన్ల కష్టాలు తప్పలా కనిపించడం లేదు.
ఈలోపు రాధేశ్యామ్ (Radhe Shyam) కు ఓటీటీ నుంచి భారీ ఆఫర్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో రాధేశ్యామ్ ను ఓటీటీ రిలీజ్ చేయాలి అని చూస్తునారట మేకర్స్. అయితే ఈసినిమా కోసం రెండు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. నెట్ ప్లిక్స్ తో పాటు.. జీ5 సంస్థ కూడా పోటా పోటీగా వందల కోట్ల ఆఫర్ తో రాధేశ్యామ్ ను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొంత కాలం వెచి చూడాల్సిందే.