Asianet News TeluguAsianet News Telugu

R Narayanamurthy :‘బంగార్రాజు’సక్సెస్ మీట్ లో నారాయణమూర్తి షాకింగ్ కామెంట్స్

ఈ నాలుగు రోజులు లాక్ డౌన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా చేసిన ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. అన్ని షోలు బ్రహ్మండంగా ఆడించుకోండి అని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల..

R Narayanamurthy comments at Bangarraju Success Meet
Author
Rajahmundry, First Published Jan 19, 2022, 9:53 AM IST

నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌లు హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం బంగార్రాజు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే రూ. 50 కోట్లను రాబ‌ట్టి రికార్డు క‌లెక్ష‌న్ల‌ దిశ‌గా దూసుకుపోతోందీ చిత్రం. క‌రోనాను సైతం త‌ట్టుకొని ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. దీంతో సినిమా స‌క్సెస్‌ను చిత్ర యూనిట్ సెల‌బ్రేట్ చేసుకుంది. బంగార్రాజు బ్లాక్ బ‌స్ట‌ర్ మీట్ పేరుతో సక్సెస్ మీట్ కార్య‌క్ర‌మాన్ని మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. సక్సెస్ మీట్ ని రాజమండ్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సక్సెస్ మీట్ లో ఆర్ నారాయణ మూర్తి మాట్లాడిన మాటలు అంతటా వైరల్ అవుతున్నాయి.
 
 ఆర్ నారాయణ మూర్తి ఈ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ”సినిమాని కాపాడాలని సంక్రాంతికి లాక్ డౌన్, కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షోలకు పర్మిషన్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. సంక్రాంతి పండగంటే దేవుడి పండుగ, కోడి పందాల పండుగ, సినిమా పండగ. సినిమాని కాపాడాలని ఈ నాలుగు రోజులు లాక్ డౌన్ లేకుండా కర్ఫ్యూ లేకుండా చేసిన ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. అన్ని షోలు బ్రహ్మండంగా ఆడించుకోండి అని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడం వల్ల ఈ రోజు ‘బంగార్రాజు’ నాలుగు రోజులకే 50 కోట్ల క్లబ్ లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ విజయం సాధ్యమైంది” అని తెలిపారు.

 కరోనా లాక్ డౌన్,కర్ఫూ లేకుండా చేసి అంటూ జగన్ సినిమా కు సాయిం చేసారని ఆర్ నారాయణ మూర్తి అంటున్న మాటలు వైరల్ అవుతున్నాయి. జనం కరోనాతో బాధపడుతున్నా నాగార్జునకు సక్సెస్ మీట్ కు ఫర్మిషన్ ఇచ్చారని ఇండైరక్ట్ గా చెప్పినట్లు అయ్యిందంటున్నారు.

      నాగ్ మాట్లాడుతూ.. ఇటీవ‌ల జ‌గ‌న్‌తో స‌మావేశం గురించి చిరంజీవితో మాట్లాడాన‌ని చెప్పుకొచ్చారు. సినీ ప‌రిశ్ర‌మ‌పై సానుకూలంగా స్పందించిన జ‌గ‌న్‌కు నాగ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక‌పై సినీ ప‌రిశ్ర‌మ‌కు అన్నీ మంచి రోజులేన‌ని చెప్పుకొచ్చారు నాగార్జున‌. ఎన్టీఆర్ , ఏఎన్నార్ సినీ పరిశ్రమకు రెండు కళ్లలాంటి వారని చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం వాళ్లిద్దరు జీవించే ఉంటారని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రపంచమంతా సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు తెలుగువాళ్లు సినిమా చూస్తామనే నమ్మకాన్ని కలిగించారని, బంగార్రాజు విజయం నా నమ్మకం కాదు, తెలుగు ప్రేక్షకులపై ఉన్న నమ్మకమ‌ని నాగార్జున అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios