పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి నుంచి వస్తోన్న మరో చిత్రం 'మార్కెట్లో ప్రజాస్వామ్యం'. రీసెంట్ గా సినిమా ఆడియో వేడుకను నిర్వహించగా మెగాస్టార్ ముఖ్య అథితిగా వచ్చారు. ఈవెంట్ లో నారాయణమూర్తి తన స్పీచ్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ గురించి మాట్లాడుతూ తన జీవితాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. 

పీపుల్స్ స్టార్ మాట్లాడుతూ.. మీరు నా సినిమా ఆడియో ఫంక్షన్ కి వస్తే సినిమాకు ప్రమోషన్ హెల్ప్ అవుతుందని చెప్పగానే మెగాస్టార్ ఏ మాత్రం ఆలోచించకుండా వస్తానని చెప్పారు. మంచి మనసున్న వ్యక్తి నా సినిమా కోసం వచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రాణం ఖరీదు సినిమా షూటింగ్ లో మెగాస్టార్ హీరోగా చేసినప్పుడు. నేను జూనియర్ ఆర్టిస్ట్. 

అప్పుడు మెగాస్టార్ చిరంజీవి - నూతన ప్రసాద్ - చంద్రమోహన్ ని రాజమండ్రి అప్సర లాడ్జ్ లో ఉంచారు. నన్ను కూడా అక్కడే ఉంచి మంచి భోజనం పెడతారని అనుకున్నా కానీ ఒక వంటపాకలో నన్ను ఉంచారు. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి నాకు కంపెనీ ఇచ్చారని చెప్పిన నారాయణ మూర్తి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అదే విధంగా అప్పుడే చిరంజీవి ఇండస్ట్రీని ఏలేస్తాడని ఆ రోజుల్లోనే చెప్పానని అందుకు మెగాస్టార్ కూడా కృతజ్ఞతలు చెప్పినట్లు పీపుల్స్ స్టార్ వివరణ ఇచ్చారు.