మహేష్ బాబు తప్పుకుందాం అనుకున్నాడు కానీ తప్పట్లేదు
మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నాడు. ముందుగా నిర్మాత పివిపి ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. దానికి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు నిర్మాతలుగా దిల్ రాజు, అశ్వినీదత్ ల పేర్లు పడుతున్నాయి. దీంతో పివిపి కోర్టును ఆశ్రయించారు. తనతో చేస్తానని అగ్రిమెంట్ చేసిన ప్రాజెక్ట్ మరొకరితో ఎలా చేస్తారంటూ న్యాయస్థానాన్ని కోరగా.. ఈ విషయంలో 14 మందికి నోటీసులు వెళ్లాయి.
అందులో మహేష్ బాబు కూడా ఉన్నాడు. 'బ్రహ్మోత్సవం' సినిమా డిజాస్టర్ కావడంతో అతడితో రెండు సినిమాలు చేస్తానని కమిట్ అయ్యాడు మహేష్ బాబు. ఈ ఏడాదిలోపు ఓ సినిమా చేయాలి. దానికి సంబంధించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. దీంతో ఇప్పుడు తప్పక దిల్ రాజు తన సినిమాలో పివిపికి కూడా వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. నిజానికి ఈ కేసుకు సంబంధించిన హియరింగ్ మరో 10 రోజుల్లో ఉంది.
స్టే తొలగిస్తే ఓకే కానీ లేదంటే సినిమా ముందుకు కదలదు. లేనిపోని తలనొప్పులు ఎందుకనే ఉద్దేశంతోపివిపికి వాటా ఇస్తే సరిపోతుందని ఆయన్ను భాగస్వామిగా తీసుకోవాలని అనుకుంటున్నారు. నిజానికి అశ్వినీదత్ కు మహేష్ ఇదివరకే ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ కు ఆయన్ని జోడించారు. ఇప్పుడు పివిపిని కూడా యాడ్ చేయడం ద్వారా అగ్రిమెంట్ పూర్తవుతుందని ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి మహేష్ బాబు.. పివిపి నుండి ఎంతగా తప్పుకుందామని అనుకున్నా తప్పక సినిమాలో వాటా ఇప్పించాల్సివస్తోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated May 24, 2018, 12:02 PM IST