'పుష్ప' హిందీ రిలీజ్ ట్విస్ట్, అడ్డంగా ఇరుక్కుపోయారా?
ఈ సినిమా హిందీ రిలీజ్ విషయంలో సమస్య వచ్చి పడిందట. రైట్స్ తీసుకున్న థర్డ్ పార్టీ ఈ సినిమా థియేటర్ విడుదలకు మొగ్గు చూపకుండా.. అన్ని తెలుగు డబ్బింగ్ సినిమాల మాదిరిగానే యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే డైరక్ట్ గా రిలీజ్ అవుతుందని.. హిందీలో మాత్రం థియేటర్ రిలీజ్ కు ఇబ్బందులు ఎదుర్కొంటోందని సమాచారం. ఆ ఇష్యూని సాల్వ్ చేయాలని అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారట.
ఇంతకీ సమస్య ఏమిటంటే...ఎప్పటిలాగే అల్లు అర్జున్ సినిమాని తెలుగు,మళయాళంలో రిలీజ్ చేద్దామని ‘పుష్ప’ హిందీ డబ్బింగ్ హక్కుల్ని అమ్మేసారట. పుష్ప సినిమాను పాన్ ఇండియా సినిమాగా అనుకోకముందుగానే ఇదంతా జరిగిపోయింది. మైత్రీ మూవీస్ సంస్థ హిందీ డబ్బింగ్ హక్కులను అలవాటు ప్రకారం విక్రయించేశారు. తీరా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిన తరువాత హిందీ హక్కులు కొనుక్కున్న వ్యక్తి థియేటర్లలో విడుదలకు అంగీకరించడం లేదు.
దాంతో మైత్రీ అధినేతలు హిందీ డబ్బింగ్ కొనుక్కున్న వ్యక్తితో చర్చలు జరిపారట. అయితే కొన్ని కండీషన్స్ తో హిందీ విడుదలకు ఓకే చెప్తున్నారట. కానీ అలా చేయడం వల్ల థియోటర్స్ వల్ల వచ్చే ఆదాయం ఎంతో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం మైత్రీ మూవీస్ వారు మాత్రం నష్టపోతారట.
ఆ కండీషన్ ఏమిటంటే... డబ్బింగ్ రైట్స్ కొన్న వ్యక్తి దగ్గరే హిందీ రైట్స్ ఉంటాయట. అయితే పబ్లిసిటీ, థియేటర్ ఖర్చులు మైత్రీ మూవీస్ నే పెట్టుకుని, పర్సంటేజ్ ఇస్తే థియేటర్ విడుదలకు అంగీకరిస్తానని అంటున్నారట. లేదూ అంటే అగ్రిమెంట్ ప్రకారం యూ ట్యూబ్ లో విడుదల అవుతుందని చెబుతున్నారట. గీతా ఆర్ట్స్ ద్వారా ఈ సమస్యని సాల్వ్ చేద్దామని చూసినా కాలేదట.
ఇక పుష్ప సినిమా హిందీ హక్కులు ఇప్పుడు దాదాపు 40 కోట్లు దాకా పలుకుతున్నాయి. 'పుష్ప' థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కలిపి ఇంచుమించు 100 కోట్ల వరకు వచ్చ అవకాసం ఉంది. కానీ 'పుష్ప' రైట్స్ ను మాత్రం పాతిక కోట్లకే ఇచ్చేసారని అంటున్నారు. కాబట్టి ఇధి పెద్ద సమస్యే అని చెప్తున్నారు.