Asianet News TeluguAsianet News Telugu

పట్టుచీర కట్టుకున్న అల్లు అర్జున్‌.. `పుష్ప 2` నుంచి నయా లుక్‌ లీక్‌.. వైరల్‌..

అల్లు అర్జున్ ‘పుష్ప2’ నుంచి లీక్ లు వస్తూనే ఉన్నాయి. దీనిపై టీమ్ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక రిలీజ్ విషయంలోనూ టీమ్ క్లారిటీ ఇచ్చారు. 

Pushpa 2 The Rule Movie Update Allu Arjun Look Viral NSK
Author
First Published Jan 30, 2024, 11:39 AM IST | Last Updated Jan 30, 2024, 3:16 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  Pushpa 2 The Rule చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. జగదీశ్ కేసు తర్వాత ఈ చిత్రం మళ్లీ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు, నార్మల్ ఆడియెన్స్  ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈచిత్రం ఆలస్యమైంది. ఎట్టకేళలకు 2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ప్రకటించారు. 

అయినా... ఇటీవల మళ్లీ ఈ చిత్రం విడుదల వాయిదా అంటూ వార్తలు వచ్చాయి. కానీ టీమ్ తాజాగా ఇచ్చిన అప్డేట్ తో అవన్నీ పుకార్లని తేలిపోయింది. పుష్ప  రూల్ 200 రోజుల్లో ప్రారంభం కానుందని నిన్న మేకర్స్ అప్డేట్ అందించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా  మూవీ షూటింగ్ స్పాట్ నుంచి అల్లు అర్జున్ లుక్ ఒకటి లీక్ అయ్యింది. అమ్మవారి గెటప్ లో ఐకాన్ స్టార్ కనిపించడం అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఈ చిత్రంలో జాతర సన్నివేశం వేరే రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే బన్నీ చెప్పిన విషయం తెలిసిందే. ఇక యాక్షన్ సీన్లను కూడా సుకుమార్ గ్రాండ్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. విజువల్స్, సాంగ్స్, కథ కూడా ఆడియెన్స్ అంచనాలను రీచ్ అవుతుందని హామీనిచ్చారు. కానీ ఈలోగా సెట్స్ నుంచి ఇలా ఫొటోలు లీక్ అవ్వడం టీమ్ ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. 

ఇక పుష్ప2 పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న Rashmika Mandanna కథనాయికగా నటిస్తోంది. సునిల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Pushpa 2 The Rule Movie Update Allu Arjun Look Viral NSK

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios