Asianet News TeluguAsianet News Telugu

#Pushpa2:మైత్రీ, అమేజాన్ మధ్య చిచ్చు పెట్టిన 'పుష్ప'?

మైత్రీ మూవీస్ సినిమాలని మొదటి నుంచి అమేజాన్ ప్రైమ్ రైట్స్ తీసుకుంటూ వస్తోంది.  కానీ ఈ రెండింటి మధ్య చిచ్చు పెట్టింది `పుష్ప 2`. ఏ

Pushpa 2 Deal Mythri Movie Makers Amazon Relation affected jsp
Author
First Published Nov 26, 2023, 3:21 PM IST


ప్రతీ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమా ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.  ప్రతీ శుక్ర‌వారం  పెద్ద స్టార్లు న‌టించిన‌ నాలుగైదు పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌స్తున్నాయి. ఈ క్రమంలో ప్రతీ సినిమాకు మంచి ఓటిటి రేట్లు పలుకుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల గురించి అయితే చెప్పక్కర్లేదు. వాటికి అదిరిపోయే రేట్లు పలుకుతున్నాయి.  ఓటిటి సంస్దల మధ్య పోటి కూడా అదే స్దాయిలో ఉంటోంది. అమేజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ప్లిక్స్ ఈ రెంటిలో ఒకటి ఖచ్చితంగా పెద్ద సినిమా రైట్స్ సొంతం చేసుకుంటోంది. ఈ క్రమంలో పుష్ప 2 సినిమా ఓటిటి రైట్స్ గురించి కూడా పోటి ఏర్పడినట్లు సమాచారం. అయితే ఈ క్రమంలో అమేజాన్ తో చిన్న వివాదం లాంటిది చోటు చేసుకుందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు రీసెంట్ గా ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది..ఇదిలా ఉంటే ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది (2024) ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా, తాజాగా పుష్ప 2 సినిమా ఓటీటీ ఒప్పందం గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది..

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘పుష్ప 2’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు  సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌తో ఈ ఓటీటీ సంస్థ కు భారీ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. ముందుగా పుష్ప 2 హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఎంతగానో పోటీ పడింది. అయితే, ఈ సీక్వెల్ రైట్స్ కోసం మేకర్స్ భారీగా డిమాండ్ చేయటంతో అమెజాన్ ప్రైమ్ వీడియో వెనక్కి తగ్గింది.. 

ఈ రైట్స్ కోసం ముంబై నుంచి హైదరాబాద్ కు అమేజాన్ లో పెద్ద స్దాయి వ్యక్తులు రంగంలోకి దిగారని, నెలల తరబడి నెగోషియేషన్స్ జరిపారని చెప్తున్నారు. మైత్రీ మూవీస్ సినిమాలని మొదటి నుంచి అమేజాన్ ప్రైమ్ రైట్స్ తీసుకుంటూ వస్తోంది. ఓ మాదిరిగా ఆడిన సినిమాలకు కూడా రిలేషన్ కోసం మంచి రేట్ పే చేస్తోంది. అలాంటప్పుడు ఇలాంటి పెద్ద సినిమా రైట్స్ తమకే ఇవ్వాలి కదా వారు అంటున్నారట.కానీ అంత బడ్జెట్ పెట్టి సినిమా తీసేటప్పుడు ఎమోషన్స్ కి లోనైతే ఇబ్బంది అవుతుందని మంచి రేటు రాగానే నెట్ ప్లిక్స్ కు ఇచ్చేసినట్లు చెప్తున్నారు.

2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.30కోట్లకు దక్కించుకుంది. తాజాగా సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప 2’ మూవీ డిజిటల్ హక్కులను అంతకంటే మూడు రెట్లు అధికంగా చెల్లించి నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది… సుమారు రూ.100కోట్లకు ఈ ఓటీటీ డీల్ జరిగినట్టు సమాచారం.. పుష్ప 2 సినిమాకు ఫుల్ క్రేజ్ ఉండటంతో ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నెట్‍ఫ్లిక్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios