టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉంది. కానీ దానికి పూరి జగన్నాథ్ కండీషన్స్ పెడుతున్నారు. తమ బ్యానర్ కూడా సినిమా నిర్మాణంలో యాడ్ అవ్వాలని.. అలానే నిర్మాణ బాధ్యతలు ఛార్మికి ఇవ్వాలని అతడికి కొన్ని షరతులు ఉన్నాయి.

దీనికి సంబంధించి రేపు చర్చలు జరగనున్నాయి. పూరి బ్యానర్ కి ఏ బ్యానర్ యాడ్ అవుతుందనేది రేపు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ పరిస్థితి అంత బాగున్నట్లు లేదు. 'డియర్ కామ్రేడ్' సినిమా డిజాస్టర్ కావడంతో అతడు బాగా డిసప్పాయింట్ అవుతున్నాడు. విజయ్ కెరీర్ ఇక క్లోజ్ అనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

'డియర్ కామ్రేడ్' సినిమా డిజాస్టర్ అని, దీంతో విజయ్ కొత్త 'హీరో' ఆపేశారని, క్రాంతి మాధవ్ తో విజయ్ చేస్తోన్న సినిమా నాని రిజెక్ట్ చేసిన స్టోరీ అని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి నేపధ్యంలో అర్జెంట్ గా ఓ పెద్ద కాంబినేషన్ అనౌన్స్ చేయాలనే ప్రయత్నంలో విజయ్.. పూరిని కలిశాడని మరో ఒకట్రెండు రోజుల్లో మైత్రి, విజయ్ దేవరకొండ, పూరి  జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన బయటకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. క్రాంతి మాధవ్ సినిమా పూర్తయిన తరువాత విజయ్-పూరి ల సినిమా మొదలవుతుందని సమాచారం.