లైగర్ మూవీ రిజల్ట్ తో పూరి జగన్నాధ్ కెరీర్ ప్రశ్నర్థకంగా మారింది అనే కామెంట్స్ వినిపించాయి. ఆ చిత్రం పూరికి దర్శకుడిగా నిర్మాతగా అనేక సమస్యలు తెచ్చిపెట్టింది.లైగర్ తర్వాత పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం ఏ హీరోతో ఉంటుంది.. స్టార్ హీరోలు ఇక అతడికి అవకాశాలు ఇస్తారా ? ఇలా అనేక కామెంట్స్ వినిపించాయి. ఎట్టకేలకు నిరీక్షణకు తెరదించుతూ పూరి జగన్నాధ్ అదిరిపోయే కాంబినేషన్ ని అఫీషియల్ గా ప్రకటించారు.
లైగర్ మూవీ రిజల్ట్ తో పూరి జగన్నాధ్ కెరీర్ ప్రశ్నర్థకంగా మారింది అనే కామెంట్స్ వినిపించాయి. ఆ చిత్రం పూరికి దర్శకుడిగా నిర్మాతగా అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. విపరీతమైన హైప్ తో రిలీజ్ అయిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాద్ దర్శకుడిగా మాత్రమే కాక.. ఛార్మితో కలసి నిర్మాతగా కూడా వ్యవహారించారు.
లైగర్ తర్వాత పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం ఏ హీరోతో ఉంటుంది.. స్టార్ హీరోలు ఇక అతడికి అవకాశాలు ఇస్తారా ? ఇలా అనేక కామెంట్స్ వినిపించాయి. ఎట్టకేలకు నిరీక్షణకు తెరదించుతూ పూరి జగన్నాధ్ అదిరిపోయే కాంబినేషన్ ని అఫీషియల్ గా ప్రకటించారు. పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం తన ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ పోతినేనితోనే ఖరారైంది.
కొద్దిసేపటి క్రితమే ఈ క్రేజీ కంబోని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నాలుగేళ్ళ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పూరి జగన్నాధ్, రామ్ పోతినేని మరోసారి కలిశారు. ఒక ఫోర్స్ లాగా మరో క్రేజీ మూవీతో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేస్తూనే ఛార్మితో కలసి నిర్మించబోతున్నారు అని పూరి కనెక్ట్స్ సంస్థ ప్రకటించింది.
ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన మరిన్ని డిటైల్స్ తో దిమాఖ్ ఖరాబ్ అనౌన్స్ మెంట్ రేపు సాయంత్రం 4 గంటలకు ఉంటుందని ప్రకటించారు. లైగర్ మూవీ పరాజయం చెందినప్పుడు ఛార్మి ఇన్వాల్వ్మెంట్ పై అనేక విమర్శలు వినిపించాయి. ఇప్పుడు పూరి మారోసారి ఆమెకి నిర్మాణ భాద్యతలు అప్పగించారు.
ఇదిలా ఉండగా 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీలో రామ్ ఊరమాస్ అవతారంలో అదరగొట్టాడు. మరి అలాంటి కాంబినేషన్ రిపీట్ అవుతోంది అంటే ఆడియన్స్ లో హైప్ ఎక్కిపోవడం ఖాయం.
