పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కతున్న పాన్ ఇండియా స్థాయి సినిమా టైటిల్ గా ఫైటర్ ప్రచారంలో ఉంది. మీడియా మొత్తం ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి  విజయ్ కొత్త సినిమా అంటే ఫైటర్ అనే ప్రచారం చేస్తోంది. జనాల్లోకి వెళ్లిపోయింది.   ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనన్య పాండే నటిస్తోంది. అయితే  ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ మార్చాల్సిన పరిస్దితి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగింది. సంక్రాంతి వెళ్లాక తిరిగి మొదలు కానుంది. అయితే ఇప్పుడు ఇదే పేరుతో హిందీలో మరో సినిమా తెరకెక్కేందుకు సిద్దం అవుతోంది. అది ఏ సాదా సీదా హీరో సినిమానో అయితే సమస్య లేదు. కానీ ఈ హిందీ ఫైటర్ సినిమాలో స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నాడు. 

‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’, ‘వార్‌’...సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌ నటించిన ఈ రెండూ చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ కలయికలో వస్తోన్న కొత్త చిత్రానికి ‘ఫైటర్‌’ అనే టైటిల్ ని ఖరారు చేయడంతోపాటు సెప్టెంబరు 30 2022న సినిమా విడుదల అంటూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో హృతిక్‌ సరసన దీపికా పదుకొణె నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రటీమ్. పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రంగా దీన్ని తెరకెక్కించబోతున్నారు. ఫైటర్‌ జెట్స్‌ నేపథ్యంగా కథ సాగుతుందని సమాచారం. ఈ ఏడాది చివరికి ‘ఫైటర్‌’ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. 

దాంతో ఇప్పుడు హిందీలో తమ సినిమాను రిలీజ్ చేయాలంటే టైటిల్ మార్చాల్సిందే. దాంతో ఇప్పుడు పూరి జగన్నాథ్ ఆలోచనలో పడినట్లు సమాచారం. ఆయన ఊహించని షాక్ అని అంటున్నారు. మరి ఈ విషయమై ఏ నిర్ణయం తీసుకుంటాడో అంటున్నారు. ఇప్పటిదాకా అఫీషియల్ గా టైటిల్ ప్రకటించలేదు కాబట్టి..మరో క్యాచీ టైటిల్ తో పూరి ఖచ్చితంగా వస్తాడని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి పూరి ఏ డెసిషన్ తీసుకుంటారో.