నందమూరి బాలకృష్ణ 60 వ పుట్టిన రోజు వేడుకలు వారం రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. కామన్‌ డీపీని వైరల్‌ చేయటం దగ్గర నుంచే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేయటం మొదలు పెట్టారు. అదే సమయంలో బాలయ్య కూడా వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ హడావిడి చేస్తున్నాడు. దాదాపు అన్ని టీవీ చానెల్స్‌తో పాటు కొన్ని యూట్యూబ్‌ చానల్స్‌కు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ.

తాజాగా ఓ ఇంటర్వ్యూల దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంటర్య్వూలో భాగంగా యాంకర్‌.. మీరు పూరి జగన్నాథ్‌తో సినిమా చేయబోతున్నారా అని ప్రశ్నించగా.. `పూరితో సినిమానా.. మరి ఇడ్లీ, వడతో ఏం లేవా?` అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో పూరి ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. బాలయ్య కెరీర్‌లో పైసా వసూళ్‌ లాంటి డిఫరెంట్ సినిమా ఇచ్చిన పూరి గురించి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే బాలయ్య అభిమానుల వాదన మాత్రం మరోలా ఉంది. పూరి జగన్నాథ్‌ ఉన్న చనువు కారణంగానే బాలయ్య అలా కామెంట్ చేశాడని అంటున్నారు. అంతేకాదు గతంలోనే బాలయ్య, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తానని చెప్పాడని వారిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే సినిమా ఉంటుందని కూడా చెప్తున్నారు.