డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ అత్యంత వేగంగా క్వాలిటీ అవుట్ పుట్ తో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పూరి జగన్నాథే. ఈ విషయాన్ని చాలా మంది అంగీకరిస్తారు. అందుకే వరుసగా పరాజయాలు ఎదురైనా పూరి చిత్రాల వల్ల నిర్మాతలకు అంతగా నష్టం ఉండదు. 

ప్రస్తుతం పూరి, రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. జులై 18న ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇటీవల వరంగల్ లో ఇస్మార్ట్ బోనాలు పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. తనకు టెంపర్ తర్వాత సరైన హిట్ లేదని తెలిపాడు. 

తాను విపరీతమైన ఆకలితో ఉన్న సమయంలో రామ్ దొరికాడు అని పూరి తెలిపాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంపై చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గానే ఉంది. కానీ ఈ చిత్రంపై ఆడియన్స్ లో ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడడం లేదు. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

కానీ పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తాడని కొందరు అభిమానులు నమ్ముతున్నారు. పూరి చిత్రాలు కథ కంటే స్క్రీన్ ప్లే పరంగా ఎక్కువ విజయం సాదిస్తుంటాయి.