కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ మూవీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. సలార్ అనే టైటిల్ తో కెజిఎఫ్ మూవీని నిర్మించిన హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ, ఈ చిత్రాన్ని నిర్మించనుంది. భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సలార్ మూవీలో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. 

సలార్ మూవీ ప్రకటన నేపథ్యంలో దేశంలోని అనేక పరిశ్రమలకు చెందిన ప్రముఖులు స్పందించారు. ప్రభాస్ మరియు చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెష్ తెలియజేశారు. కాగా కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా సలార్ మూవీని ఉద్దేశిస్తూ ట్వీట్ వేశారు. అలాగే వెల్కమ్ బ్యాక్ టూ హోమ్ అని కూడా ఆ ట్వీట్ లో పొందుపరిచారు. పునీత్ ట్వీట్ చేసిన ఆ లైన్ కన్నడిగుల కోపానికి కారణం అయ్యింది. 

వెల్కమ్ హోమ్ అని చెప్పడానికి ప్రభాస్ కన్నడిగుడా అంటూ పునీత్ పై విమర్శల దాడి చేస్తున్నారు అక్కడి ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ ట్వీట్ పునీత్ రాజ్ కుమార్ కి తలనొప్పి తెచ్చిపెట్టింది. భాషాభిమానం, ప్రాంతాభిమానం మెండుగా ఉండే కన్నడిగులు అనేక మార్లు ఇలాంటి విషయాలపై నిరసన వ్యక్తం చేశారు. గతంలో ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ వస్తుందని వార్తలు రాగా, కన్నడ హీరోలతో కాకుండా బయట పరిశ్రమల హీరోలతో సినిమాలు చేయకూడదంటూ నిరసన వ్యక్తం చేశారు.