జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జైషే ఏ మహ్మద్‌ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడి యావత్‌ ప్రపంచాన్ని కలిచివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఈ  ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పుల్వామా ఘటన నేపథ్యంలో పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని భారత్‌ భావిస్తోంది. ఇది దేశభక్తి ని రెట్టింపు చేస్తోంది. 

అంతేకాక అందరికి ఉరి దాడి ఘటన గుర్తుకు వస్తోంది.  ఉరీ ఘటనకు ప్రతీకారంగా ఎవ్వరూ ఊహించనంతగా పాక్‌పై మెరుపుదాడులు చేసి ఆదేశానికి బుద్ధి చెప్పింది. ఇప్పుడు కూడా అలాంటి మెరుపు దాడులు చేయాలని భారత్ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఉన్నట్టుండి సినిమాహాళ్లలో బాలీవుడ్ సినిమా ‘యురి’ టిక్కెట్లకు అమితమైన డిమాండ్ ఏర్పడింది. 

 2016 సెప్టెంబర్-18న జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని  ఉరి టౌన్ దగ్గర్లో 2016 సెప్టెంబర్-18న భద్రతా బలగాలపై నలుగురు అత్యాధునిక ఆయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆధారాంగా తెరకెక్కిన ఉరి సినిమాలో హీరోగా విక్కీ కౌశల్ నటించి అందరిచేత ప్రశంశలందుకొన్నాడు. 

పేటీఎం, బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమాను మరిన్ని  ఎక్కువ స్క్రీన్‌లపై విడుదల చేయనున్నారు. జనవరి 11 న విడుదలైన ‘యురి’ చిత్రాన్ని... పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాదుల బేస్ క్యాంప్‌పై భారతసైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా నిర్మించారు.   

పేటీఎం తన యాప్‌పై ఈ సినిమాను తిరిగి ఈ సినిమాని ప్రమోట్ చేస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు తిరిగి ఎగస్ట్రా షో స్లాట్‌లను ఏర్పాటుచేశారు. ఇందుకోసం ‘గలీబాయ్’ సినిమా షోలను కొంతమేరకు తగ్గించారు.