గరుడ వేగలో కిరాతకమైన జార్జ్ బటర్ ఫ్లై ఎఫెక్ట్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న పీఎస్వీ గరుడవేగ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూ.25కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం
“నువ్వు నా దగ్గరికి నా మిత్రుడిలా వచ్చి ఉంటే.., నీ కూతురిని చెరపట్టిన వాళ్ళు ఈపాటికే నరకం చూస్తూ ఉండే వాళ్ళు” ...తన సాయం కోరి వచ్చిన వ్యక్తిని భయపెడుతూ, తన చేతిలో ఉన్న పిల్లిని ప్రేమ గా నిమురుతూ, గాడ్ ఫాదర్ చిత్రంలో డాన్ కోర్లియోని అన్న మాటలు... అదేంటో ప్రతి గొప్ప విలన్ కి జంతువులకి విడదీయరాని సంబంధం.. వాళ్లకి వాటితో ఉన్న అనుబంధం మనుషులతో ఉండదు.
జార్జ్, తనలో మనిషి కంటే జంతువు పాళ్ళే ఎక్కువ ఉండడం వల్లేమో ,తనకి కూడా జంతువులంటే,ముఖ్యంగా సీతాకోకచిలుకలు అంటే చచ్చేంత ప్రేమ, అవి చచ్చిన తర్వాత వాటి మీద ఇంకా ప్రేమ.. తనకు భయం అవి బతికి ఉండగా వాటిని ముట్టుకుంటే వాటి అందమైన రెక్కలు చిరిగిపోతాయేమో అని.. ఆ రెక్కలు చప్పుడు చేయకుండా చావు వాటిని ఆపేంత వరకు ఎదురు చూస్తాడు.. తర్వాత ప్రశాంతమైన ఆ రెక్కలను జాగ్రత్త గ భద్ర పరుస్తాడు, తనకు ఆ నిర్జీవమైన సీతాకోకచిలుకలు తన చేతిలో చచ్చిన మనుషులను గుర్తు చేస్తాయి, రెపరెపలాడే ఆ రెక్కలు ఒక్కసారిగా ఆగిపోయాక,చంపద్దు అని ప్రాధేయ పడిన బాధితుడి మరణం తర్వాత ఏర్పడే నిశ్శబ్దాన్ని గుర్తు చేస్తాయ్.. ఒక్కొక్క బాధితుడి గుర్తు గా ఒక్కొక్క సీతాకోకచిలుక, అది తన కర్కసమో,క్రూరత్వమో కాదు... అది తన అభిరుచి,అలవాటు.
