టాలీవుడ్ కమెడియన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పృథ్వీ సినీ ప్రముఖులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమావాళ్లను ఎందుకు నమ్మకూడదు అంటారో.. ఇప్పుడున్న పరిస్థితులే నిదర్శమని అన్నారు. 

జగన్ ను భారీ మెజారిటీతో గెలిపించిన జనాల నిర్ణయాన్నీ ఎవరు పట్టించుకోవడం లేదని, పాతికేళ్ల వరకు పరిపాలించే జగన్ సినీ పెద్దలకు కనిపించడం లేదా అని వ్యాఖ్యానించారు. చాలావరకు సినీ ప్రముఖులు ఏపీ రాజకీయాలపై మౌనం వహించడంతో పృథ్వీ ఈ విధంగా కామెంట్ చేశారు. 

నరసారావు పేట నియోజకవర్గం గురించి మాట్లాడుతూ.. కోడెల ట్యాక్స్ కారణంగా చాలా మంది వ్యాపారాలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన వారికి వైసిపి నేత శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండగా ఉంటారని అన్నారు. అంతే కాకుండా నరసారావు పేటలో 30 ఏళ్ల వరకు వైసిపి జెండా ఎగిరేలా గోపిరెడ్డి ముందుకు సాగుతారని పృథ్వీ ఆశాబావం వ్యక్తం చేశారు.