మహానటి సినిమాతో కీర్తి సురేష్‌కు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. అలనాటి అందాల నటి సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించి కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. అంతేకాదు ఈ సినిమాను నిర్మించి స్వప్నదత్‌, దర్శకుడు నాగ అశ్విన్‌లతో ఎంతో క్లోజ్‌ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన చాలా కాలం అవుతున్నా ఇప్పటికీ ఏదో ఒక సందర్బంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తన కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ సినిమాను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంది కీర్తి సురేష్‌. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా పేజ్‌లో ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది. ఎగ్జైటింగ్‌గా చూస్తున్న ఫోటోను షేర్ చేసిన కీర్తి. `నిన్ను చూసిన ప్రతీ సారి నాలో ఆ ఎగ్జైట్‌మెంట్ కనిపిస్తుంది. కానీ ఈ సారి మాత్రం నా లాస్ట్‌ పేమెంట్‌ వల్ల ఈ ఎగ్జైట్‌మెంట్‌. మిస్‌ యు స్వప్న` అంటూ కామెంట్‌  చేసింది కీర్తి సురేష్.

అయితే కీర్తి పోస్ట్ పై నిర్మాత స్వప్న దత్‌ కూడా ఆసక్తికరంగా స్పందించింది. `కీర్తి సురేష్ ఫాలోవర్స్‌ కోసం, ఈ పిచ్చి పిల్ల తన పేమెంట్‌ కూడా అడగదు` అంటూ కామెంట్ చేసింది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు స్వప్నా దత్‌, ప్రియాంక దత్‌. తొలి ప్రయత్నంగా ఎవడే సుబ్రమణ్యం సినిమాను రూపొందించి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు.