పీఎస్.వీ గరుడవేగ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజశేఖర్ మరోసారి ట్రాక్ లోకి వచ్చాడన్నది నిజం. అలాగే ఆయన తాజా చిత్రం  కల్కి పోస్టర్, టీజర్ తో అంచనాలు పెరిగాయి. . అ! లాంటి   సినిమాని రూపొందించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడంటూ  చర్చ మొదలైంది. ఇవన్నీ పాజిటివ్ సైన్స్.  ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరగటానికి పనికొచ్చేవే. కానీ నిర్మాత సి.కళ్యాణ్ తన అత్యాశతో ఎక్కువ రేట్లు చెప్తున్నాడని, దాంతో ముందుకు వచ్చిన ఏరియావైజ్ బిజినెస్ డీల్స్ అన్నీ వెనక్కి వెళ్తున్నాయని ట్రేడ్ టాక్.

ప్రతీ సినిమా గరుడవేగ కాదని, సీనియర్ హీరోపై అంతంత రేట్లు పెట్టలేమమని బయ్యర్లు పంపిణీదారులు తెగేసి చెప్తున్నారట.  రాజశేఖర్ మార్కెట్ పరిధి ఏమిటో మాకు తెలుసు అని, ఎంత పెద్ద హిట్ అయ్యినా దాని స్పాన్ కొంతవరకే ఉంటుందని కానీ యాభై కోట్లు, వంద కోట్లకు వెళ్ళదు కదా అని అంటున్నారట.  అంతెందుకు `భరత్ అనే నేను` బ్లాక్ బస్టర్  హిట్ కొట్టినా కొన్ని ఏరియాల్లో బయ్యలర్లకు నష్టాలు తప్పలేదన్న విషయం గుర్తు చేస్తున్నారట.  ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ కొన్ని ఏరియాల బిజినెస్ ఫైనల్ కాలేదని తెలుస్తోంది.

శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు. ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ‌, నందితా శ్వేత‌, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా సంద‌డి చేయ‌నున్నారు.

అశుతోష్ రానా మరియు నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా క‌థాంశం సాగుతుంది. ఏప్రిల్ చివరికి అన్ని పనులు పూర్తి చేసి మేలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.