కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటికే అన్ని రంగాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుంటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా టాలీవుడ్‌ లో కరోనా మరణంతో కలవరం మొదలైంది. తెలుగు సినీ నిర్మాత  పోకూరి రామారావు శుక్రవారం సాయంత్రం క‌న్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు.

పోకూరి రామారావు, ఈత‌రం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు సోద‌రుడు. ఇటీవలే ఆయన కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన కాంటినెంటల్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించటంతో శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. పోకూరి బాబురావు నిర్మాత ఈ తరం ఫిలింస్‌ బ్యానర్‌లో రూపొందుతున్న చిత్రాలకు రామారావు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.