Asianet News TeluguAsianet News Telugu

అయితే అవతార్ 2 త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల ముందు నథింగ్ అంటావ్!

అవతార్ 2 మూవీ నచ్చలేదంటూ మరోసారి కామెంట్స్ చేశారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. తన అభిప్రాయం ఇతరులను ఎందుకు బాధిస్తుందో అర్థం కావడం లేదంటున్నారు. 
 

producer nagavamshi once again made comments against avatar 2
Author
First Published Jan 17, 2023, 2:25 PM IST

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో సూర్యదేవర నాగవంశీ ఒకరు. బడా హీరోలతో పాటు చిన్న హీరోలతో కూడా ఏక కాలంలో చిత్రాలు చేస్తున్నారు. అవతార్ 2 సినిమాపై ఈయన నెగిటివ్ కామెంట్ చేశారు. అవతార్ 2 సినిమా త్రీడీలో చేశారు కాబట్టి విజువల్ వండర్ అనాలి. లేదంటే జనాలు నా సినిమాలు ఆదరించరు, అని ట్వీట్ చేశారు. అవతార్ 2 గొప్ప సినిమా అని నేను ఒప్పుకోకపోతే ప్రేక్షకులు నన్ను విమర్శిస్తారన్న అర్థంలో నాగవంశీ సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. తనకు మూవీ నచ్చలేదని ఆయన చెప్పకనే చెప్పాడు. 

నాగవంశీ పోస్ట్ ట్రోలింగ్ కి గురైంది. దర్శకుడు కామెరూన్ అభిమానులు, అవతార్ సిరీస్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్నవారు రియాక్ట్ అయ్యారు. నాగవంశీని సోషల్ మీడియా ద్వారా ఏకిపారేశారు. ఈ విమర్శలపై నాగవంశీ స్పందించారు. ఏవేవో మూడు గంటలు చూపిస్తే విజువల్ వండర్ అనాలా, నేను చూడలేకపోయాను.  మన దర్శకులైన రాజమౌళి, త్రివిక్రమ్ చిత్రాలు నచ్చలేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఎవరో పరిచయం లేని జేమ్స్ కామెరూన్ మూవీ నచ్చలేదంటే ఎందుకు కోపం వస్తుందో అర్థం కావడం లేదంటూ చురకలు వేశారు. 

నాగవంశీ తన అభిప్రాయం చెప్పడంలో ఎలాంటి తప్పులేదు. అయితే ఒక నిర్మాత అయ్యుండి పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్ లో నెగిటివ్ కామెంట్ చేయడం సరికాదని చెప్పాలి. ఎందుకంటే ప్రముఖులు ఓ సినిమా బాగోలేదని నేరుగా చెప్పడం ద్వారా సినిమా ఫలితం దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. అవతార్ 2 హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. 

హాలీవుడ్ లో అవతార్ 2 చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. ది గార్డియన్ పత్రిక అతి తక్కువ రేటింగ్ ఇచ్చింది. అయినప్పటికీ అవతార్ 2 వరల్డ్ వైడ్ $1.5 బిలియన్  వసూళ్లకు చేరుకుంది. అయితే పార్ట్ 1 వసూళ్లకు ఇంకా చాలా దూరంలో ఉంది. 13 ఏళ్ళ క్రితం విడుదలైన అవతార్ $ 2.92 బిలియన్  వసూళ్లతో వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా ఉంది. కాగా ఇండియాలో అవతార్ 2 గత హాలీవుడ్ చిత్రాల కలెక్షన్స్ బ్రేక్ చేసింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లతో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డులకెక్కింది. 

 తన వ్యాఖ్యలు సమర్ధించుకునే క్రమంలో నాగవంశీ...  జేమ్స్ కామెరూన్ చిత్రాలతో రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలకు పోలిక పెట్టడం విడ్డూరం. ఎంత ప్రాంతీయాభిమానం ఉన్నా... కామెరూన్ సృజన, సాంకేతికత మరో యాభై ఏళ్లకు కూడా తెలుగు దర్శకులు అందుకుంటారని అనుకోవడం లేదు. గతంతో పోల్చితే ఇండియన్ మూవీస్ సాంకేతికంగా అభివృద్ధి చెందాయన్న మాట వాస్తవం. అలా అని కామెరూన్, స్పీల్ బర్గ్ చిత్రాలకు పోటీ ఇచ్చేంత కాదు. ప్రపంచ సినిమాకు కొత్త ఊహలు పరిచయం చేశారు వారు. వారి ఊహలకు అంతకు మించిన దృశ్యరూపం ఇచ్చారు. ఇండియన్ సినిమాకు బడ్జెట్ పరిమితులు ఉన్నాయేమో కానీ సృజనకు కాదు. అందులో ఇప్పటికీ మనం ఎక్కడో ఉన్నాం... ఇది అంగీకరించాల్సిన నిజం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios