Asianet News TeluguAsianet News Telugu

అందుకే ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ లేట్.. సినిమా ఆలస్యమైతే ఏంటీ? నాగవంశీ కామెంట్స్

‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్, సినిమా విడుదల తదితర అంశాలపై ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కావాల్సిందాని కోసం సినిమా ఆలస్యమైతే ఏంటీ? అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాంగ్స్ పై క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు. 
 

Producer Naga Vamsi Interesting Comments on Guntur Kaaram  First Single NSK
Author
First Published Nov 1, 2023, 4:39 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో  మూడోసారి వస్తున్న చిత్రమే ‘గుంటూరు కారం’ (Guntur Kaaram).  13 ఏళ్ల తర్వాత ఈ కాంబో సెట్ అవడం ఇటు ఫ్యాన్స్, అటు ఆడియెన్స్ లో అంచనాలను పెంచేసింది. మార్కెట్ లోనూ డిమాండ్ ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ఆలస్యమైంది. ఎట్టకేళ్లకు వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలో సమయం ఉండటంతో చిత్రం నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

ఇప్పటి వరకు చిత్రం నుంచి కేవలం మాస్ గ్లింప్స్, పోస్టర్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ ఎలాంటి స్ట్రాంగ్ అప్డేట్ రాలేదు. ప్రస్తుతం మాత్రం ‘గుంటూరు కారం’ సాంగ్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థమన్ కు వరుసగా ఎక్స్ ద్వారా ట్వీట్లు చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇక దీనిపై నిర్మాత సూర్య దేవర నాగశంశీ (Naga Vamsi) స్పందించారు. సినిమా సాంగ్స్, రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

గుంటూరు కారం.. ఫస్ట్ సింగిల్ పై మాట్లాడుతూ.. హైప్, క్రేజ్ వల్ల మొదటి పాటలోని లిరికల్స్ ను సాంగ్ లో క్వాలిటీని చూసుకోవడమే సరిపోతోంది. అందుకే లేట్ అవుతోంది. తప్పకుండా నవంబర్ మొదటి వారంలోనే ఫస్ట్ సాంగ్ వస్తుంది. సంక్రాంతి లోపే మొత్తం నాలుగు సాంగ్స్ ను రిలీజ్ చేయనున్నాం. ఇక సినిమా ఆలస్యం అయితే ఏంటీ? సినిమా సక్సెస్ కావాలి అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ‘గుంటూరు కారం’పై నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తై, డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. డబ్బింగ్  స్టార్ట్ అవడంతో సాంగ్స్ కోసమే అభిమానులు ఎదురుచూస్తున్నారు. థమన్ సైతం నవంబర్, డిసెంబర్ మొత్తం మనేదే అంటూ మరింత హైప్ ఇచ్చారు. మొత్తానికి ఈ వారం నుంచి వరుసగా అప్డేట్స్ రానున్నదనేది స్పష్టం అవుతోంది. చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, జయరామ్, రమ్యకృష్ణ, సునీల్, బ్రహ్మనందం ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2024 జనవరి 12న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios