దిల్ రాజు బలగం సినిమా చేస్తే నేనూ అదే చేయాలా, వేదికపై నిర్మాత ఫైర్.. సినిమాల్లో రాజకీయాల్లో అంతే..
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ స్టార్ హీరోల చిత్రాలతో పాటు మీడియం రేంజ్ చిత్రాలు కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మ్యాడ్ మూవీ ప్రమోషన్స్ కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో నాగవంశీ మాట్లాడారు.

హారిక అండ్ హాసిని సంస్థ నిర్మాత చినబాబు (రాధాకృష్ణ) అండదండలతో నాగవంశీ ప్రొడ్యూసర్ గా మారారు. చినబాబు.. నాగవంశీ బాబాయ్ అయిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ స్టార్ హీరోల చిత్రాలతో పాటు మీడియం రేంజ్ చిత్రాలు కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మ్యాడ్ మూవీ ప్రమోషన్స్ కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో నాగవంశీ మాట్లాడారు.
మీడియా ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు నాగ వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్ రాజు తన కుమార్తెని నిర్మాతగా పెట్టి బలగం చిత్రం తెరకెక్కించారు. మీరు కూడా మీ చెల్లిని నిర్మాతగా పెట్టి అలాంటి మూవీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని ప్రముఖ పీఆర్వో సురేష్ కొండేటి అడిగారు.
ఈ ప్రశ్నకు నాగవంశీ ఆగ్రహంతో సమాధానం ఇచ్చారు. దిల్ రాజు బలగం చేశారని నేనూ అలాంటిదే చేయాలని రూల్ ఉందా.. మేము ఇండస్ట్రీలో ఉన్నాము కాబట్టి మా చెల్లి ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి వస్తోంది అంతే. సినిమాల్లోకి రాజకీయాల్లోకి వ్యక్తిగత ఆసక్తి లేకుండా ఎవరూ రారు అని నాగవంశీ అన్నారు.
అలాగే గుంటూరు కారం చిత్రంపై నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. గుంటూరు కారం చిత్ర కలెక్షన్స్ రాజమౌళి సినిమా రేంజ్ లో ఉంటాయి.. ఇది గ్యారెంటీ అంటూ అంచనాలు పెంచేశాడు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.