ఈ సంవత్సరం భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా మారింది.
ఆస్కార్ వేడుక మొదలైపోయింది. ప్రపంచ సినీ ప్రేమికులంతా ఈ అవార్డు వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనితో పాటు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ ది బ్రీత్స్ సినిమాలు కూడా ఇండియా నుంచి నామినేషన్స్ లో నిలివటం మరో విశేషం. ఆస్కార్ మనని వరిస్తుందా లేదా అనేది ప్రక్కన పెడితే... నిర్మాత దానయ్య గురించి ఓ వర్గం సోషల్ మీడియాలో చర్చ మొదలెట్టింది.
ఇంత భారీ బడ్జెట్ సినిమాని ,ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తున్న క్షణాన ఆ సినిమాకు పెట్టుబడి పెట్టి ,బయిటకు తెచ్చిన దానయ్య ఏరి అని ఎంక్వైరీ చేస్తున్నారు. రాజమౌళి కుటుంబం, సినిమా టీమ్, హీరోలు అందరూ ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. కేవలం డివివి దానయ్యే కనపడటం లేదు. దాంతో అసలు ఏం జరిగింది..ఎందుకు దానయ్య దూరం జరిగారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓ వర్గం మీడియా కూడా దీన్ని హైలెట్ చేస్తోంది.
రాజమౌళితో ఏమన్నా ఇష్యూ ఉందా లేక ఆస్కార్ వ్యవహారానికి సంభందించిన ఖర్చు తాను పెట్టడం లేదని దూరం ఉన్నారా.. బాహుబలి నిర్మాత శోభు వారితోనే ఉన్నారు. అది నచ్చలేదా అంటూ మాట్లాడుతున్నారు. అయితే అసలు ఆయన దూరంగా ఉండి ఈ ఈవెంట్ ని వీక్షించాలనుకోవటానికి కారణం ఏమిటి...అనేది స్వయంగా ఎవరో ఒకరు ఆ టీమ్ నుంచి చెప్తే కానీ నిజా నిజాలు తెలియదు. అయితే నిర్మాత కూడా ఇలాంటి సమయంలో ఆ టీమ్ తో పాటే ఉంటే బాగుండేది అనేది మాత్రం నిజం.
ఈ సంవత్సరం భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు తో పాటు మరో నాలుగు పాటలు నిలిచాయి. నాటు నాటు సాంగ్ RRR సినిమా నుంచి నామినేట్ అయింది. ఈ పాటని చంద్రబోస్ రాయగా, కీరవాణి సంగీతం అందించారు.
