టాలీవుడ్‌ ప్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాలోని నర్సింగ్‌పల్లిలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య ఎలాంటి హడావిడి లేకుండా తేజస్విని వివాహం చేసుకున్నాడు దిల్‌ రాజు. ఆయన పెళ్లి వార్త, తరువాత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. పెళ్లి తరువాత కూడా దిల్ రాజుకు సంబంధించి ప్రతీ చిన్న విషయం వైరల్‌గా మారుతోంది. తాజాగా ఈ కొత్త దంపతులు తీసుకున్న సెల్ఫీ ఫోటో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

పెళ్లి తరువాత భార్య తేజస్వినితో దిల్‌ రాజు దిగిన తొలి సెల్ఫీ అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు దిల్ రాజు పెళ్లి చేసుకున్న తేజస్విని ఎవరు అని తెలుసుకునేందుకు నెటిజెన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఆమె గతంలో ఎయిర్‌ హోస్టస్‌ పనిచేసిందన్న వార్త తప్ప మరో విషయం ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో లేదు. దిల్‌ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికే దిల్ రాజు కూతరికి వివాహం అయి పిల్లలు కూడ ఉన్నారు.