Asianet News TeluguAsianet News Telugu

నిర్మాత, దర్శకురాలు ఫైట్ : నీ సినిమా చెత్త.. నీది పరమ వేస్ట్

సోషల్ మీడియా వచ్చేక అభిప్రాయాలు మనస్సులో ఉంచుకోవటం లేదు. వెంటనే షేర్ చేసేస్తున్నారు. దాని వల్ల కొన్ని సార్లు ఫలితం పాజిటివ్ గా ఉన్నా..చాలా సార్లు సమస్యలు తెచ్చిపెడుతోంది. 

Producer Dhananjayan Fires On 90ML Movie
Author
Hyderabad, First Published Mar 4, 2019, 2:33 PM IST

సోషల్ మీడియా వచ్చేక అభిప్రాయాలు మనస్సులో ఉంచుకోవటం లేదు. వెంటనే షేర్ చేసేస్తున్నారు. దాని వల్ల కొన్ని సార్లు ఫలితం పాజిటివ్ గా ఉన్నా..చాలా సార్లు సమస్యలు తెచ్చిపెడుతోంది. అయితే అవన్ని మాకు అనవసరం ...ఎవరేమనుకుంటే మాకేంటి అన్న రీతిలో సెలబ్రెటీలు సైతం సోషల్ మీడియాలో తగువులకు దిగుతున్నారు. ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తమిళ నిర్మాత ధనుంజయన్, మహిళా దర్శకురాలు అనితా కూడూ అదే పనిలో ఉన్నారు. తాజాగా రిలీజైన 90ఎంఎల్‌ విషయమై ఈ మాటల యుద్దం మొదలైంది. 

బిగ్‌బాస్‌ గేమ్‌ షో ఫేమ్‌ ఓవియ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్‌. దీన్ని మహిళా దర్శకురాలు అనితా ఉదీప్‌ తెరకెక్కించారు. ఈ సినిమాలో నటి ఓవియతో పాటు ఆమె స్నేహితురాళ్ల పాత్రలు మద్యం తాగడం, దమ్ము కొట్టడం, లిప్‌లాక్‌ చుంబనాలు, అదే విధంగా సహజీవనం, లెస్బియన్‌ సన్నివేశాలాంటివి చోటుచేసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

90ఎంఎల్‌ చిత్రం గురించి నిర్మాత ధనుంజయన్‌ స్పందిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టించే చిత్రం అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా డబ్బు సంపాదన కోసం యువతరాన్ని నాశనం చేయకూడదని అన్నారు.

ఈయన వ్యాఖ్యలకు 90ఎంఎల్‌ చిత్ర దర్శకురాలు అనితా ఉదీప్‌ బదులిచ్చేలా మీరు నిర్మించిన చంద్రమౌళి చిత్రంలో సందేశం ఇచ్చేలా అశ్లీల పాటను పొందుపరిచిన చిత్రానికి నేను దర్శకరాలిని కాదు అని వ్యంగ్య వ్యాఖ్యలతో ట్వీట్‌ చేశారు. 

అందుకు ధనుంజయన్‌ స్పందిస్తూ... నా చిత్రంలో పాట గ్లామరస్‌గా ఉందే కానీ అశ్లీలంగా మాత్రం లేదని అన్నారు. నా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌నే పొందాను. మీ చిత్రం మాదిరి ఏ సర్టిఫికెట్‌ కాదు. అయినా చిత్రంలో పాటలు ఎలా ఉండాలన్నది దర్శకుడి నిర్ణయం అని, నేనెప్పుడూ పాటల విషయంలో సొంత నిర్ణయాలను తీసుకోలేదని బదులిచ్చారు. 

దీంతో దర్శకురాలు అనితా ఉదీప్‌ సార్‌ మీతో వివాదం బోర్‌ కొడుతోంది. కాస్త ఆసక్తికరంగా, కొంచెం స్మార్ట్‌గా మాట్లాడండి అని పేర్కొన్నారు. ఆ తరువాత ధనుంజయన్‌ నుంచి బదులు రాకపోవడంతో అనితా ఉదీప్‌ ప్లీజ్‌ పారిపోకండి. మీతో కొంచెం కామెడీ చేయాలని ఉంది అని ట్వీట్‌ చేశారు. వీరి వివాదం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.   

Follow Us:
Download App:
  • android
  • ios