బాలకృష్ణ, బోయాపాటి శ్రీనులది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీనితో వీరిద్దరి కాంబినషన్ లో మరో చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో బోయపాటి బాలయ్యతో తదుపరి చిత్రం ఉంటుందని ప్రకటించాడు. 

కానీ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య కేఎస్ రవికుమార్ కు ఓకే చెప్పాడు. దీనితో బాలయ్య, బోయపాటి సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు తలెత్తాయి. అనేక ఊహాగానాల అనంతరం తాజాగా బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో తెరకెక్కబోయే హ్యాట్రిక్ చిత్రానికి ప్రకటన వచ్చింది. 

ఈ చిత్రాన్ని జయ జానకి నాయక ఫేమ్ మిర్యాల రవీందర్ నిర్మించనున్నారు. బాలయ్య, బోయపాటితో మిర్యాల రవీందర్ ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. డిసెంబర్ నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.