రీసెంట్ గా ఓ కుర్ర హీరో తను చేసిన డజను సినిమాల్లో అసలు దేనికీ పారితోషికం తీసుకోలేదని.. వరుస ఫ్లాప్ లతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెప్పాడు. ఇప్పుడు తనే నిర్మాతగా మారి ఓ సినిమా తీశాడు. ఇప్పుడు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

అయితే తను రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేశాడనే విషయాన్ని అతడితో కలిసి పని చేసిన నిర్మాతలు అంగీకరించడం లేదు. ఈ కుర్ర హీరోతో సినిమా చేసిన ఓ నిర్మాత అతడికి పాతిక లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు చెప్పాడు.

ముందుగా సినిమా కోసం ఈ కుర్ర ఇరవై లక్షలు రెమ్యునరేషన్ అడిగాడని.. ఆ తరువాత అతడు నటించిన ఓ సినిమాకి మంచి క్రేజ్ రావడంతో యాభై లక్షలు డిమాండ్ చేశాడని చెప్పాడు. అయితే నలభై లక్షలకు బేరం కుదుర్చుకున్నామని.. పాతిక లక్షలు అడ్వాన్స్ గా కూడా ఇచ్చామని అన్నారు. మిగిలిన మొత్తాన్ని ప్రాఫిట్ లో షేర్ గా కావాలని కోరినట్లు గుర్తుచేసుకున్నారు. 

అయితే సినిమా ఆడకపోవడంతో అతడికి షేర్ ఇవ్వలేదని.. అయినప్పటికీ పాతిక లక్షలు రెమ్యునరేషన్ అయితే ఇచ్చాం కదా.. అప్పుడు ఫ్రీగా సినిమా చేసినట్లు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాడు. అలానే ఈ హీరో పని చేసిన కొన్ని సినిమాలను కార్పోరేట్ కంపనీలు నిర్మించడంతో మాట్లాడుకున్న డబ్బంతా అడ్వాన్స్ రూపంలో కొంత, ఫైనల్ సెటిల్మెంట్ 
కింద మిగిలిన మొత్తాన్ని ఇచ్చేశారు. అలాంటిది ఈ హీరో డబ్బు తీసుకోకుండా సినిమా చేశాననే పెద్ద స్టేట్మెంట్ ఎలా ఇస్తాడని మండిపడుతున్నాడు.