Asianet News TeluguAsianet News Telugu

పవన్‌‌కి, జగన్ ప్రభుత్వంతో రాజీ చేస్తాం.. ట్యాక్సులు కట్టకపోవడం వల్లే.. నిర్మాత బన్నీ వాసు

అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్ లర్‌` చిత్రం ఈ నెల 15న దసరా కానుకగా విడుదల కానుంది. `బొమ్మరిల్లు` భాస్కర్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

producer bunny vasu open up controversy with pawan kalyan and ap government
Author
Hyderabad, First Published Oct 13, 2021, 7:00 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పవన్ కళ్యాణ్‌ చేసిన కామెంట్లకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య జరిగిన మిస్‌ కమ్యూనికేషన్‌ని రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు నిర్మాత బన్నీవాసు. చిత్ర పరిశ్రమ సమస్యలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. అందుకోసం స్పెషల్‌ కమిటీని ప్లాన్‌ చేస్తున్నట్టు చెప్పారు బన్నీవాసు. అక్కినేని అఖిల్‌(akhil)), పూజా హెగ్డే(pooja hegde) జంటగా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్ లర్‌` చిత్రం ఈ నెల 15న దసరా కానుకగా విడుదల కానుంది. `బొమ్మరిల్లు` భాస్కర్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా producer bunny vasu అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి అమ్మాయిలో ఉందే అంశాలు, ఆశలు, పెళ్లి తర్వాత ఎలా ఉంటాయి. ఎలా మారతాయనేది ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఎంటర్‌టైనింగ్‌గా మంచి సందేశాన్ని అందిస్తున్నామని తెలిపారు. దసరాకి మంచి సినిమా అవుతుందన్నారు. అయితే పెళ్లి చేసుకునే వాళ్లు తెలుసుకోవాల్సిన అంశాలను most eligible bachelorలో చూపించబోతున్నట్టు చెప్పారు. ఓ రకంగా పెళ్లి చేసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అని తెలిపారు. 

ప్రస్తుతం జరుగుతున్న `మా` వివాదంపై ఆయన స్పందించారు. దీన్ని కూర్చుని సాల్వ్ చేసుకోవాల్సింది అని, మిస్‌ కమ్యూనికేషన్‌ రాకుండా చూసుకుంటే బాగుండేదన్నారు. కూల్‌గా డీల్‌ చేస్తే ఇంత వివాదంగా మారేది కాదని చెప్పారు. `రిపబ్లిక్‌` సినిమా ఫంక్షన్‌లో పవన్‌ కళ్యాణ్‌ కామెంట్ల ప్రభావం.. ఏపీ ప్రభుత్వంతో నెలకొన్న వివాదంపై ఆయన స్పందిస్తూ, ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమాల విడుదల, టికెట్ల రేట్లకి సంబంధించి pawanకి వాస్తవాలను వివరించామని, అలాగే ఏపీ ప్రభుత్వం అధికారులు, మంత్రులకు వివరించామని తెలిపారు. 

also read:ముండమోసినట్లు ఏడుస్తున్నారు.. అనసూయ ఓటమి, ప్రకాష్ రాజ్ ప్యానల్ వైఖరిపై నరేష్ హాట్ కామెంట్స్

ఇద్దరూ అర్థం చేసుకున్నారని, అన్ని పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. కరోనా ఎక్కువగా ఉండటం కారణంగా 100 శాతం ఆక్యుపెన్సీకి ఇంకా అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదన్నారు. డిసెంబర్‌ నాటికి అక్కడ పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. అయితే `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంతో సెకండ్‌ షో విషయంలో క్లారిటీ వస్తుందని తెలిపారు.

also read: శ్రీరామ్‌ నా గుండెల్లో ఉంటాడు.. షో తర్వాత కూడా మా రిలేషన్‌ కంటిన్యూ అవుతుంది.. బిగ్‌బాస్‌5 హమీద బోల్డ్ కామెంట్

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ది తాము కోరుతున్నామన్నారు. అయితే ఏపీలో చాలా థియేటర్లు జీఎస్టీ పరిధిలో లేవని, ఎగ్జిబిటర్లు ట్యాక్సులు ఎగ్గొడుతున్నారని, అందుకే ప్రభుత్వం ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని అడుగుతున్నారని తెలిపారు. అయితే ఇది జస్ట్ ఐడియా మాత్రమే అని కార్యచరణలోకి ఇంకా వెళ్లలేదని చెప్పారు. ఆన్‌లైన్‌లో టికెట్లని ప్రభుత్వం అమ్మడం లేదని, ఆ లెక్కలు మాత్రమే వాళ్లు అడుగుతున్నారని తెలిపారు. కానీ ఈ విషయంలో అందరిలోనూ ఓ అపోహ ఉందన్నారు. 

ప్రభుత్వంతో చర్చలకు, చిత్ర పరిశ్రమకి సంబంధించి మధ్య ఒక వారధి ఉండాలని, అందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని తాము కోరుకుంటున్నామని, ఆ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. ఈ మిస్‌ కమ్యూనేషన్‌ వల్లనే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని, అవి వివాదంగా మారుతున్నాయని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios