పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న `వకీల్‌సాబ్`కి బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇప్పుడు కెరీర్‌లో మరో స్టెప్ తీసుకుంటున్నారు. నటుడిగా మారబోతున్నారు. అంతేకాదు స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కి తండ్రిగా కనిపించనున్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలుగులోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న `వకీల్‌సాబ్`కి బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు హిందీలో ఆయన అనేక హిట్ చిత్రాలను నిర్మించారు.
తాజాగా నటుడిగా మారుతున్నారు. అంతేకాదు రణ్‌బీర్ కపూర్ కి తండ్రిగానూ మరబోతున్నారు. లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో బోనీ కపూర్ నటించనున్నారట. రణ్ బీర్ కపూర్‌కి తండ్రిగా నటించనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.
బోనీ కపూర్ తెలుగులో గతంలో నాగార్జున హీరోగా రూపొందిన `అంతం` చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీన్ని బోనీ కపూర్ నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన `వకీల్‌సాబ్`తోపాటు `మైదాన్`, `బధాయి హో` రీమేక్, తమిళంలో `వాలిమై` చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇక ఆయన కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటిస్తుంది. మరో కుమారుడు అర్జున్ కపూర్ హీరోగా రాణిస్తున్నారు.
