కరోనా విజృంభిస్తున్న వేళ బయటకు వెల్లి హెయిర్ సెలూన్స్ లో కటింగ్ చేయించుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఈ క్రమంలో తన తండ్రి కోసం బండ్ల గణేష్ బార్బర్‌గా మారిపోయాడు.
కమెడీయన్, నిర్మాత బండ్ల గణేష్ ఏం చేసినా సంచలనమే. ఆయన వేదికపై మాట్లాడితే సంచలనం, చేసే పని సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల `వకీల్‌సాబ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన దేవుడిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆకాశానికి ఎత్తేశాడు. తాజాగా తండ్రి కోసం క్షరకునిగా మారాడు బండ్ల గణేష్. కరోనా విజృంభిస్తున్న వేళ బయటకు వెల్లి హెయిర్ సెలూన్స్ లో కటింగ్ చేయించుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇంట్లోనే తమకు వచ్చినట్టు కటింగ్ చేసుకోవడం, గెడ్డాలు, మీసాలు తీసుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో తన తండ్రి కోసం బండ్ల గణేష్ బార్బర్‌గా మారిపోయాడు.
`కరోనా భయంతో మా నాన్నకి ఈ రోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను` అని పోస్ట్ పెడుతూ, కటింగ్ చేస్తున్న వీడియోని పంచుకున్నాడు బండ్ల గణేష్. ఇందులో కోంబ్, ట్రిమ్మర్‌తో తనకు వచ్చినట్టు కటింగ్ చేస్తున్నాడు బండ్ల గణేష్. తండ్రి వృద్ధుడు కావడంతో ఎలా చేసినా పెద్దగా సమస్య ఏం ఉండదు. దీంతో ఇంట్లోనే కటింగ్ పూర్తి చేశాడు. ఈ వీడియోని ట్విట్టర్ ద్వారా పంచుకోగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. `సూపర్ అన్నా`, `గుడ్ జాబ్..మంచి కొడుకువని నిరూపించుకున్నావు`, `మల్టీ టాలెంటెడ్ పర్సన్‌ని నువ్వు`, `నీలాంటి కొడుకు ఉండాలి`, `కరోనా చివరికి నిన్ను ఇలా మర్చిందా` అంటూ కామెంట్లు చేస్తున్నారు.
