'ఏజెంట్' నిర్మాత అనీల్ సుంకర..తన బయ్యర్లకు కాంపన్సేట్ చేస పనిలో పడ్డారని సమాచారం.
అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమా తీవ్ర నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ ఫెయిల్యూర్ పై ఇప్పటికే నిర్మాత స్పందించగా.. తొలిసారి అఖిల్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమా ఫెయిల్యూర్ పరోక్షంగా అంగీకరించిన యువ హీరో.. అభిమానులు, శ్రేయోభిలాషులను ఉద్దేశిస్తూ ఓపెన్ లెటర్ ను ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పాడు.
అయితే ఎవరెన్ని ట్వీట్ చేసినా, మాటలు చెప్పినా,ఫ్లాఫ్ అయ్యిందని ఒప్పుకున్నా కోట్లు పోగొట్టుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ని ఓదార్చటం కష్టమే. పెద్ద ఎమౌంట్స్ పెట్టి సినిమాలు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ అందుకే చాలా సార్లు తమ డబ్బులు సెటిల్ చేయమని నిర్మాతలపై ఒత్తిడి తెస్తూంటారు. ఈ మధ్యకాలంలో అలాంటివి మరీ ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో 'ఏజెంట్' నిర్మాత అనీల్ సుంకర..తన బయ్యర్లకు కాంపన్సేట్ చేసే పనిలో పడ్డారని సమాచారం.

అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' సినిమా తీవ్ర నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ ఫెయిల్యూర్ పై ఇప్పటికే నిర్మాత స్పందించగా.. తొలిసారి అఖిల్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమా ఫెయిల్యూర్ పరోక్షంగా అంగీకరించిన యువ హీరో.. అభిమానులు, శ్రేయోభిలాషులను ఉద్దేశిస్తూ ఓపెన్ లెటర్ ను ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పాడు.
అయితే ఎవరెన్ని ట్వీట్ చేసినా, మాటలు చెప్పినా,ఫ్లాఫ్ అయ్యిందని ఒప్పుకున్నా కోట్లు పోగొట్టుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ని ఓదార్చటం కష్టమే. పెద్ద ఎమౌంట్స్ పెట్టి సినిమాలు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ అందుకే చాలా సార్లు తమ డబ్బులు సెటిల్ చేయమని నిర్మాతలపై ఒత్తిడి తెస్తూంటారు. ఈ మధ్యకాలంలో అలాంటివి మరీ ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో 'ఏజెంట్' నిర్మాత అనీల్ సుంకర..తన బయ్యర్లకు కాంపన్సేట్ చేస పనిలో పడ్డారని సమాచారం.
అనీల్ సుంకర తాజా చిత్రం `సామజవరగమన` భాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. ఆ సినిమాని 'మహాసముద్రం' తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి సెటిల్ చేశారట. వాళ్లంతా ఒడ్డున పడుతున్నట్లు సమాచారం. అంతేకాదు `ఏజెంట్`కి సంబంధించి కూడా కొంత వరకు సెట్ చేసినట్టు చెప్పారు. అయితే రాబోయే చిత్రాలు `భోళా శంకర్`, సందీప్ కిషన్ తో చేసిన `భైరవ కోన `, `హిడింభి` సినిమాలు కూడా `ఏజెంట్` తో పోగొట్టుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కు ఇవ్వబోతున్నట్లు అనిల్ స్వయంగా ఇటీవల ఇంటర్వూలో చెప్పారు. ఆ సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యి బయ్యర్లు పూర్తి స్దాయిలో నష్టాలు నుంచి బయిటపడి..సంపాదించుకుంటారని భావిస్తున్నారు. ఇప్పటికే `హిడింబ` టేబుల్ ప్రాఫిట్‌లో ఉందని, నష్టాలనుంచి గట్టేక్కించే చిత్రమవుతుందన్నారు. మరోవైపు చిరంజీవి `భోళాశంకర్` చాలా బాగా వచ్చిందని, మరో కమర్షియల్ హిట్ పక్కా అవుతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. ఈ దెబ్బతో తాను పూర్తిగా రిలీఫ్ అవుతానని వెల్లడించారు నిర్మాత.
ఇక ఏజెంట్ సినిమా రిజల్ట్ గురించి నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ ... ఏజెంట్ (Agent) సినిమా విషయంలో ఏ ఒక్కరిని తప్పు పట్టడానికి లేదు.అందరి తప్పు ఉందని తెలిపారు. కొన్ని కారణాల వలన బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్ళలేకపోయాం. ఈ విషయంలో ఎవరినీ నిందించకూడదు. నేను, సురేంద్ రెడ్డి ఈ సినిమాతో ఒక హీరోని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తామని అనుకుని మొదలుపెట్టాం. అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళలేకపోయామని ఈ సందర్భంగా అనిల్ సుంకర తెలిపారు. ఒక నిర్మాతగా ఈ ఫలితానికి తాను బాధ్యత తీసుకుంటాను అంటూ ఈయన తెలియజేశారు.